బుధవారం 05 ఆగస్టు 2020
Kamareddy - Aug 01, 2020 , 03:48:07

కళాశాలల్లోనూ

కళాశాలల్లోనూ

విద్యానగర్‌ : విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మెరుగైన సదుపా యం కల్పించింది. ఉన్నత విద్యను అభ్యసించాలంటే పట్టణాలు, మండల కేంద్రంలోని కళాశాలకు రావాలి. ఇందుకోసం ఉదయాన్నే ఇం టి నుంచి బయలుదేరి వచ్చే క్రమంలో మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లి మళ్లీ కళాశాలకు రావడం లేదు. దీంతో హాజరుశాతం తగ్గడంతోపాటు ఫలితాలపై కూడా ప్రభావం చూపుతున్నది. ఇప్పటి వరకు కేవలం పాఠశాలల్లో పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం అమలులో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. ఇకనుంచి ప్రభుత్వ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. కళాశాలలో చదువుతున్న వారందరికీ పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో కమ్మని భోజనం అందించనున్నది.

జిల్లాలో 11 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం..

జిల్లా వ్యాప్తంగా సుమారుగా 11 వేల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నాలుగు ఉన్నా యి. కామారెడ్డిలో 1700 మంది విద్యార్థులు, బాన్సువాడలో 1500 మంది, ఎల్లారెడ్డి లో 500 మంది, బిచ్కుందలో 600 మంది విద్యార్థులు మొత్తం 4500 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 16 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 3,478 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,947 మంది విద్యార్థులు మొత్తం 6425 మంది  ఉన్నారు. 

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు

పట్టణంలో ఉండే విద్యార్థులకు కళాశాలలు అక్కడే ఉండడంతో మధ్యాహ్న భోజన సమస్య ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ప్రతి రోజూ కళాశాలకు రావడానికి  ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల సమయానికి ఇండ్లలో వంట చేయకపోవడంతో కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే కళాశాలకు వస్తున్నారు.దీంతో సరిగా చదవలేక ఫలితాలు కూడా రాబట్టలేక పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని  ప్రభుత్వం కళాశాల స్థాయిలో కూడా  మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని సంకల్పించింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి మక్కువ చూపుతున్నారు.

రుచికరమైన భోజనం ..

కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరునుంది. కాలేజీలో ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజూ ఒకే రకమైన భోజనం కాకుండా పోషక విలువలతో రోజుకో రకం  పెట్టాలని నిర్ణయించారు. పొంగళి,పప్పులు, రాగులు, వెజ్‌ బిర్యానీ, లెమన్‌రైస్‌ లాంటి శాఖాహారాన్ని అందించే ఆలోచనలో ఉన్నాయి.


logo