యూరియా వచ్చేసింది..

- lమంత్రి వేముల ప్రత్యేక చొరవ
- lవివిధ ప్రాంతాల నుంచి 2,400
- మెట్రిక్ టన్నులు తరలింపు
- lహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
కమ్మర్పల్లి : జిల్లాలో వానకాలం సాగు కోసం రైతుకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు. అన్నదాతల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అవసరమైతే ముఖ్యమంత్రికి విన్నవిస్తూ నెరవేరుస్తున్నారు. తాజాగా జిల్లాలో రైతులకు యూరియా కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆయ న కృషితో నిజామాబాద్ జిల్లాకు శుక్రవారం 2 వేల 4 వందల మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. జిల్లాలో వానకాలం సాగు కోసం రైతుల పంట ల అవసరాల మేరకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. మంత్రి వినతి మేరకు జిల్లాకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 2400 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరింది. మహబూబ్ నగర్ నుంచి 500 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి నుంచి వెయ్యి, కరీంనగర్ నుంచి 500, జడ్చర్ల(మహబూబ్‌నగర్) నుంచి 400 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది.అడిగిన వెంటనే జిల్లాకు భారీగా యూరియాను పంపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్ రెడ్డికి జిల్లా రైతుల పక్షాన మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు.
విజయవంతంగా కొనుగోళ్లు
యాసంగి పంటల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంత్రి వేముల చర్యలు తీసుకున్నారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రతి రోజు అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇచ్చారు. కరోనా వేళ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. వానకాలం సాగు కోసం ముఖ్యమంత్రికి విన్నవించి వరద కాలువను కాళేశ్వరం జలాలతో నింపారు. ఈ నెల 20 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదలకు ఆదేశించారు. జిల్లా రైతాంగం కోసం మంత్రి చేస్తున్న కృషిని రైతులు అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
- మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వచ్చేశాయి..!
- ఢిల్లీలో స్వల్ప భూకంపం.. 2.8 తీవ్రత
- ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు
- పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు