శుక్రవారం 07 ఆగస్టు 2020
Kamareddy - Jul 16, 2020 , 02:38:51

లక్ష్యం దిశగా అడుగులు..

లక్ష్యం దిశగా అడుగులు..

మోర్తాడ్‌ : మహిళా సంఘాల సభ్యులకు కొవిడ్‌-19రుణాలు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో మహిళకు రూ.5వేల చొప్పున రుణాలు అందించారు. కొవిడ్‌ రుణాల పంపిణీలో  రాష్ట్రంలోనే నిజామాబాద్‌ ప్రథమస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జిల్లాలో 11,828 మహిళాసంఘాలకు రూ.61 కోట్ల 32లక్షల 10వేల రుణాలను ఇచ్చారు. జిల్లాలో జూన్‌ నెలాఖరు వరకే రుణ పంపిణీ లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా అధికారులు కృషి చేశారు. ఇప్పటి వరకు  77.47శాతంరుణాలను అందించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానం లో నిలిపిన అధికారులు జూలై నెలాఖరు వరకు వందశాతం రుణాలను ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. 

మంత్రి ఆదేశాలతో

జిల్లాస్థాయి బ్యాంకు అధికారుల సమావేశంలో మహిళలకు ఇచ్చే రుణాల విషయంలో జాప్యం చేయవద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ మహిళలకు రుణాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. కొవిడ్‌ రుణాల మంజూరు విషయంలో మొదట మహిళలకు అవగాహన లేకపోవడం తో అనుకున్న మేరకు రుణాలు ఇప్పించలేకపోవడంతో కలెక్టర్‌ కల్పించుకుని పలుమార్లు ఐకేపీ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ఎంపి క చేసిన సంఘాలకు రుణాలు అందేలా చూడాలని స్ప ష్టం చేశారు. దీంతో రుణాల పంపిణీ ప్రక్రియ వేగం పుంజుకుంది. మిగిలిన సంఘాలన్నింటికీ ఈ నెలాఖరు వరకు రుణాలు ఇప్పించే ప్రయత్నాలను అధికారులు చేస్తున్నారు.

జిల్లాలో కమ్మర్‌పల్లి టాప్‌ 

కొవిడ్‌ రుణాలు మహిళాసంఘాలకు ఇప్పించే విషయంలో కమ్మర్‌పల్లి మండలం 100.04 శాతంతో జిల్లాలోనే ప్రథమస్థానంలో ఉండగా ఎడపల్లి మండలం 54.49తో చివరిస్థానంలో ఉంది. జిల్లాలో 15,268 సంఘాలకు కొవిడ్‌  రుణా లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 11,828 మహిళా సంఘాలకు అదనపు రుణాలను మంజూరు చేశారు. ఆర్థికం గా ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ.5 వేల అదనపు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. రుణం తీసుకున్న మహిళలు నెలకు రూ.250 చొప్పున 24నెలలు చెల్లించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌, కరోనా నేపథ్యంలో అదనపు రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మహిళలు అంటున్నారు.

సిబ్బంది పనితీరు అభినందనీయం

కొవిడ్‌-19 రుణాలు ఇచ్చే విషయంలో ఐకేపీ సిబ్బంది పనితీరు అభినందనీయం. మహిళలకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయించడంతో కొవిడ్‌ రుణాల పంపిణీలో జిల్లా మొదటిస్థానంలో ఉంది. ఈ నెలాఖరు వరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాం.  మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  -రమేశ్‌ రాథోడ్‌, పీడీ


logo