బుధవారం 21 అక్టోబర్ 2020
Kamareddy - Jul 14, 2020 , 03:38:18

రైతులందరూ ఆనందంగా ఉండాలి

రైతులందరూ ఆనందంగా ఉండాలి

  • ఆర్మూర్‌ ఎమ్మెల్యే  జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌ : రైతులందరూ ఆనందంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం మాక్లూర్‌ మండలంలోని గుత్ప, నందిపేట్‌ మండలంలోని ఉమ్మెడ వద్ద ఉన్న గుత్ప ఎత్తిపోతల నుంచి సోమవారం నీటి విడుదలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మాక్లూర్‌, నందిపేట్‌ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ప్రతి రైతూ ఆనందంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుత్ప లిఫ్టును ప్రారంభించినట్లు తెలిపారు. లిఫ్టు ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకూ సాగునీరందిస్తామన్నారు. నీటి విడుదలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్‌, సంతోష్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మెట్టు సంతోష్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo