మంగళవారం 11 ఆగస్టు 2020
Kamareddy - Jul 13, 2020 , 03:04:24

జామపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

జామపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

కోటగిరి :జామకాయ, జామపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇండ్ల పెరడులో, చేల గట్లపై జామ చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు. ఈ పండులో విటమిన్‌-సీ, కాల్షియం పుష్కలంగా లభించడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని వృద్ధి చేయడంలో తోడ్పడుతుంది. అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఔషధ నిపుణులు చెబుతున్నారు. మంచి పోషక విలువలు ఉన్న జామకాయ జీర్ణశక్తికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఓ లేత జామకాయ లేదా పండు తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జామలో అధికంగా ఫైబర్‌ ఉండడంతో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను మెరగుపరుస్తుంది. వర్షాకాలంలో వచ్చే అతిసారం, జిగట విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలకు జామ ఆకు కషాయం అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. పది యాపిళ్ల కన్నా ఒక్క జామ మిన్న.. అని పోషకాహార నిపుణులు చెబుతున్నారంటే మన పెరటి చెట్టు ఫలం ఎంతో గొప్పది కదా..!

ఉపయోగాలు అనేకం..

 • జామ తలనొప్పి, పార్శవపు నొప్పులకు దివ్యఔషధంగా పని చేస్తుంది.
 • దోర జామను సానరాయి మీద అరగదీసి వచ్చిన గంధాన్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందని ఆయూష్‌ వైద్యులు సూచిస్తున్నారు.
 • సీ- విటమిన్‌ అధికంగా ఉండడంతో జలుబు నివారణకు ఎంతగానో పని చేస్తుంది.
 • కంటి సమస్యలను నివారించి చూపును మెరుగుపరచడంలోనూ జామ ఉపయోగపడుతుంది.
 • ప్రతి రోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ దరి చేరదు. 
 • దంతాల చిగుళ్లు గట్టిపడతాయి.
 • చిగుళ్ల నుంచి రక్తస్రావంఆగిపోతుంది.జామకాయలో లభించే పోషకాలు(100 గ్రాములకు)
 • విటమిన్‌-సీ : 228.3మి.గ్రా
 • విటమిన్‌ బీ-3 : 1.084 మి.గ్రా
 • ఫైబర్‌ : 5.4 గ్రా
 • పాస్పరస్‌ : 40 మి.గ్రా
 • విటమిన్‌-ఈ : 0.73 మి.గ్రా
 • కేలరీలు : 68కి కే
 • మెగ్నీషియం : 22 మి.గ్రా.


logo