ఆదివారం 09 ఆగస్టు 2020
Kamareddy - Jul 08, 2020 , 02:45:04

ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

విద్యానగర్‌/ఎల్లారెడ్డిరూరల్‌/బీబీపేట్‌/నాగిరెడ్డిపేట్‌/లింగంపేట్‌/దోమకొండ/పిట్లం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. మంగళవారం జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు మొక్కలను నాటారు. జిల్లా కేంద్రంలోని 25, 32 వార్డుల్లో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ మొక్క లను నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నా రు. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామస్తులకు రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ గణపతి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజాగౌడ్‌, సుతారి సాయిలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. బీబీపేట్‌ మండల కేంద్రంలోని బీరప్ప ఆలయ ఆవరణలో జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారి ప్రజాప్రతిని ధులతో కలిసి మొక్కలను నాటారు. 

కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, పశువైద్యాధికారిణి హేమ శ్రీ, ఎంపీడీవో నారాయణ, పంచా యతీ కార్యదర్శి శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఆసిఫ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తేలు సత్యనారాయణ, జనార్దన్‌, భూమేశ్‌, సిద్దరాములు, గొల్ల కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలో అవెన్యూ ప్లాంటేషన్‌ కొనసాగుతున్నది. ఆయా గ్రామాల కార్య దర్శులు పనులను పర్యవేక్షించారు. లింగంపేట్‌ మండలంలోని పొల్కంపేట్‌ గ్రామాన్ని మండల పంచాయతీ అధికారి ప్రభాకర్‌చారి సందర్శించి  రోడ్లకు ఇరువైపులానాటిన మొక్కలను పరిశీలిం చారు. ప్రతి మొక్కకూ కంచెను ఏర్పాటు చేయాలని సూచిం చారు. 

దోమకొండ మండల కేంద్రం తోపాటు సీతారాంపూర్‌లో జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌ మొక్కలను నాటారు. పిట్లం మండలంలోని గౌరారంతండాలో మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు నారాయణరెడ్డి సర్పంచులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచులు విజయ్‌ కుమార్‌, కాశీరాం, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బాబుసింగ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo