ఆదివారం 09 ఆగస్టు 2020
Kamareddy - Jul 08, 2020 , 02:43:03

‘గూడు’కట్టుకున్న ఆనందం

‘గూడు’కట్టుకున్న ఆనందం

పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా.... మన పంట చేలలోనా... అంటూ సమైక్య రాష్ట్రంలో పాటలు పాడుకున్నాం.. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు బీళ్లుగా ఉన్న భూములు పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా మారాయి. నీళ్లు లేక ఎండిన చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. హరితహారంలో భాగంగా మొక్కల పెంపకంతో పచ్చదనం చిగురించి ప్రకృతి పరవశిస్తున్నది. క్రమంగా అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. ఆవాసానికి అనువైన తావు లేక ఇన్నేండ్లు కానరాని పిచ్చుకలు మళ్లీ సందడి చేస్తున్నాయి. పొలంగట్ల వద్ద చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. కిలకిలా రావాలతో మనసు దోచేస్తున్నాయి. ఎల్లారెడ్డి మండల పరిధిలోని హాజీపూర్‌ తండాలో పంట పొలాల సమీపంలోని చెట్లపై ఊరపిచ్చుకలు పదుల సంఖ్యలో గూళ్లు కట్టుకొన్నాయి.   


logo