శుక్రవారం 07 ఆగస్టు 2020
Kamareddy - Jul 06, 2020 , 02:29:17

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

కామారెడ్డి/విద్యానగర్‌/ఎల్లారెడ్డి : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. ఆదివారం ‘పది గంటలు, పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ఆవరణలో గుంతల్లో నిలిచిన వర్షపు నీటిని ఆయన తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇండ్ల పరిసరాల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని 38వ వార్డులో మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ పర్యటించారు. పూలకుండీలు, ప్లాస్టిక్‌ బ్యారల్‌, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్‌ అన్వర్‌, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. ఎల్లారెడ్డి ఏడో వార్డు కౌన్సిలర్‌ భూదేవి ఆమె ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు. 


logo