శనివారం 04 జూలై 2020
Kamareddy - Jul 01, 2020 , 03:27:42

బాధిత కుటుంబానికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

బాధిత కుటుంబానికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

  • గృహప్రవేశం చేయించిన డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి,  
  •    టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి
  • వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల నగదు అందజేత

రుద్రూర్‌(వర్ని): వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో ఓ బాధిత కుటుంబానికి ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అండగా నిలిచారు. డబుల్‌బెడ్‌ రూం ఇల్లు మంజూరుచేయించి, మంగళవారం కుటుంబ స భ్యులతో గృహ ప్రవేశం చేయించారు. గ్రామంలో ఇటీవల గోడకూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు ఓ బాబు దుర్మ రణం చెందాడు.  మిగిలిన  ముగ్గురు ఆడ పిల్లలు అనాథలుకాగా, వారి బాగోగులను  అమ్మమ్మ మనిగిరి గంగవ్వ  చూస్తున్నది. గోడ కూలిన ప్రమాదంలో మూడో కూతురు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితిని స్థానిక నాయకులు పోచారం భాస్కర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పం దించి డబుల్‌బెడ్‌ రూం ఇల్లు మంజూరుచేయించారు. మంగళవారం పిల్లలతోపాటు వారి అమ్మమ్మతో గృహ ప్రవేశం చేయించారు. గాయపడిన చిన్నారి వైద్యం కోసం రూ.20 వేల నగదును గంగవ్వకు అందజేశారు.   కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిరి, సీనియర్‌ నాయకులు వీర్రాజు, కో-ఆప్షన్‌ సభ్యుడు కరీం, సర్పంచ్‌ వెంకన్న, తహసీల్దార్‌ శేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌ ఉన్నారు.logo