సోమవారం 06 జూలై 2020
Kamareddy - Jun 30, 2020 , 02:35:25

పట్టణాభివృద్ధికి సహకరించాలి

పట్టణాభివృద్ధికి సహకరించాలి

  • మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

 ఎల్లారెడ్డి రూరల్: పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ కోరారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు కర్నల్ సంతోష్ పాలకవర్గ సభ్యులు, అధికారులు నివాళులు అర్పించారు. సమస్యలపై చర్చించాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ కౌన్సిలర్లను కోరగా, రెండు, తొమ్మిదో వార్డుల కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. అనంతరం సభ్యులు 23 అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో వైస్ సుజాత, మున్సిపల్ మేనేజర్ మల్లేశం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.logo