శుక్రవారం 10 జూలై 2020
Kamareddy - Jun 04, 2020 , 01:39:36

మళ్లీ కరెంటు బిల్లింగ్‌ షురూ

మళ్లీ కరెంటు బిల్లింగ్‌ షురూ

ప్రారంభమైన మీటర్‌  రీడింగ్‌ ప్రక్రియ

బిల్లులు అందజేస్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది

మొదటి రోజు 2551 మంది వినియోగదారులకు  అందజేత

ఖలీల్‌వాడి: కరోనా వైరస్‌వ్యాప్తి, లాక్‌డౌన్‌ అమలుతో నిలిచిన మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియ జిల్లాలో బుధవారం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో 50శాతం కూడా బిల్లులు వ సూలు కాకపోవడం ట్రాన్స్‌కో పై తీవ్ర ప్రభావం చూపింది. సడలింపులు ఇవ్వడంతో ఆపరేటర్లు ఇంటింటికీ వెళ్లి మీట ర్‌ రీడింగ్‌ నమోదు చేసి బిల్లులు అందజేస్తున్నారు. సంస్థ సూచన మేరకు కొం త మంది వినియోగదారులు గతేడాది తాము చెల్లించిన బిల్లు ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన బిల్లులు కట్టారు. ప్రస్తుతం వాస్తవ రీడింగ్‌ ఆధారంగా వినియోగదారులకు అందజేస్తున్న బిల్లు మొత్తానికి, వినియోగదారులు చెల్లించిన అంచనా బిల్లు కు వ్యత్యాసం ఉంటే సర్దుబాటు చేయనున్నారు. రెండు నెలలకు సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ను నమోదు చేస్తున్న ఆపరేటర్లు నెలలవారీగా విభజించి బి ల్లు అందజేస్తున్నారు. మొదటి రోజు ని జామాబాద్‌ జిల్లాలో 2551 మంది వినియోగదారులకు బిల్లులు అందజేశారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 2,01, 116 కనెక్షన్లకు గాను 1045 కనెక్షన్లకు సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి బిల్లులు అందజేశారు. బోధన్‌ డివిజన్‌లో 68,967 కనెక్షన్లకుగాను 520,  ఆర్మూర్‌లో 2,09, 608 కనెక్షన్లకుగాను 986కి సంబంధించిన బిల్లులను అందజేశారు. 


logo