ఆదివారం 12 జూలై 2020
Kamareddy - Jun 03, 2020 , 02:47:28

వార్డు సభ్యులపై దాడి..

వార్డు సభ్యులపై దాడి..

ఉపసర్పంచ్‌పై కేసు నమోదు

దోమకొండ: ఇద్దరు వార్డుసభ్యులతో పాటు కారోబార్‌పై దాడి చేసిన ఘటనలో సంగమేశ్వర్‌ ఉపసర్పంచ్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఉమేశ్‌ తెలిపారు. ఏఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో చేపట్టిన పనుల కోసం చెక్‌లపై ఉపసర్పంచ్‌ సంతకం చేయలేదని సర్పంచ్‌ సుమలత, పాలకవర్గ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎల్పీవో చంద్రనాయక్‌, ఎంపీవో తిరుపతిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు కొమ్ము పోచవ్వ, రాంరెడ్డితో ఉపసర్పంచ్‌ నరేశ్‌ వాగ్వాదానికి దిగాడు.

వారి మధ్య మాటలు పెరగడంతో ఉపసర్పంచ్‌ కుర్చీతో, నేమ్‌ ప్లేట్‌తో దాడి చేశాడు. వారితో పాటు కారోబార్‌ శ్యాంకుమార్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వార్డు సభ్యురాలు పోచవ్వ ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్‌పై కేసు నమోదు చేశామని ఏఎస్సై తెలిపారు.


logo