శనివారం 11 జూలై 2020
Kamareddy - May 31, 2020 , 04:12:48

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ 

విద్యానగర్‌ : అధికారులు సమన్వయంతో పనిచేసి జూన్‌ 1వ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, గ్రామపంచాయతీ సెక్రెటరీలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం, సున్నం, చిన్న గ్రామ పంచాయతీలకు 20, పెద్ద గ్రామ పంచాయతీలకు 50 చొప్పున ఆయిల్‌ బాల్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేయాలని ఆదేశించారు. ప్రతి పనికి ముందు, తరువాత ఫొటోలు తీసి ఆల్బమ్‌ భద్రపర్చాలని తెలిపారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో చందర్‌నాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న పాల్గొన్నారు.logo