శనివారం 06 జూన్ 2020
Kamareddy - May 23, 2020 , 02:30:55

ఏరువాకకు సన్నద్ధం

ఏరువాకకు సన్నద్ధం

చేతికి వచ్చిన యాసంగి పంట

వానకాలం పంట వేసేందుకు సన్నద్ధం

ముమ్మరంగా వ్యవసాయ పనులు

అన్నదాతలు పొలంబాట పట్టారు. నేలను చదును చేసి..  దుక్కి దున్ని.. మడుల్లో నీటిని పారిస్తున్నారు. కేజ్‌వీల్‌తో దమ్ముకొట్టి పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకాలు లేకుండా మరమ్మతులు చేసుకుంటున్నారు. భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో నీటికి ఇబ్బందులు లేకుండా పోయింది. అవసరమైన ఎరువులు, విత్తనాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీలకు చేతినిండా పని లభిస్తున్నది. ఆర్మూర్‌ మండలంలో రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు.

-స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ నమస్తే తెలంగాణ 


logo