జగిత్యాల రూరల్, ఏప్రిల్ 2: నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పథకాలు వరం లా మారాయని ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమా ర్ అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన ఎనిమది మందికి కల్యాణలక్ష్మి , షాదీ ముబాకర్ చె క్కులు, పదిమందికి రూ.3.75లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులతో పాటు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో చీరెలను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు జుంబర్తి రాజ్ కుమార్, కోరె గంగమల్లు, బొడ్ల జగదీశ్, నాయకులు అందారావు, సతీశ్రాజ్, బండారి నరేందర్, ఆరుముల్ల పవన్ పాల్గొన్నారు.