లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఆ తర్వాత సినిమా సినిమాకు తనలోని నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ..బాహుబలి, అరణ్య లాంటి ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో రానా 11 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్బంగా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చినపుడుమెయిన్స్ట్రీమ్ సినిమా తప్ప ప్రత్యామ్నాయం ఏం లేదు. రెగ్యులర్ ప్రేమకథలు చేసే వ్యక్తిని కాదు. నేను కాలేజీకి వెళ్లలేదు. అందువల్ల కాలేజీ కథలకు నేను అంతగా కనెక్ట్ కాను.
ప్రతీకారం, యాక్షన్ లాంటి జోనర్లో రెగ్యులర్, కమర్షియల్ సినిమాకు నేను పెద్ద అభిమానిని కాదు. భాష పేరుతో సరిహద్దులు గీసుకోలేదు. కథలను ఓకే చేసేటపుడు భాషను పట్టించుకోను. ఇవన్నీచివరికి వచ్చాయి. ప్రస్తుతం నేను కంఫార్ట్ జోన్లో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.