బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Mar 30, 2020 , 01:46:04

కొనసాగుతున్న లాక్‌డౌన్‌..

కొనసాగుతున్న లాక్‌డౌన్‌..

నమస్తే తెలంగాణ యంత్రాంగం: కరోనా వైరస్‌ను కట్టడికి చేయడానికి చేపట్టిన లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఆ దివారం ఉదయం నిత్యావసర దుకాణాలు,చికెన్‌, మట న్‌, కూరగాయల మార్కెట్‌లో సామాజిక దూరం పాటి స్తూ ప్రజలు కొనుగోలు చేశారు. కామారెడ్డిలో టీఆర్‌ఎస్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై నివసిస్తున్న వారికి ఆహార పొట్లాలను అందజేశారు.కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి వద్ద ఉన్న మార్కెట్‌ను కలెక్టర్‌ సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.మరింత సమయం పెంచాలని రైతులు కలెక్టర్‌ను కోరగా ఉదయం 11 వరకు కూరగాయలు అమ్ముకోవచ్చని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ లక్ష్మీనారాయణ, టీపీ వో శైలజ ఉన్నారు. జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గా ల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. వారం రోజులుగా ప్రజ లు ఇండ్లకే పరిమితమయ్యారు. కామారెడ్డి మండలం, బీబీపేట్‌, రాజంపేట దోమకొండ మాచారెడ్డి మండలాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది.  సరిహద్దు గ్రా మాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాల వారు తెలంగాణలోకి రాకుండా కట్టడి చేశారు. ఆయా గ్రామా ల్లో దాతలు మాస్కులను, ఆహార పదార్థాలను అందించారు. పిట్లంలో సంగారెడ్డి డీఎస్పీ శివకుమార్‌గౌడ్‌ కు టుంబీకులు మాస్కులను పంపిణీ చేశారు. జుక్కల్‌ మం డలంలో డీఎస్పీ దామోదర్‌రెడ్డి పర్యటించారు. బాన్సువాడలో మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి నిత్యావసర దుకాణాలను తనిఖీ చేశారు. కరోనా వ్యాధి అనుమానితులను గాంధీ వైద్యశాలకు తరలించారు. దుబాయ్‌, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు అవగాహన కల్పించి క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  

నిజామాబాద్‌ జిల్లాలో.. 

నిజామాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఉద యం, సాయంత్రం మాత్రమే నిత్యావసర వస్తువుల కొ నుగోలుకు బయటకు వస్తున్నారు. బయట తిరుగుతున్న వారికి పోలీసులు అవగాహన కల్పిస్తూ ఇండ్లకు పంపుతున్నారు. నిజామాబాద్‌ మండలంలోని కొత్తపేట్‌ గ్రా మంలో కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తల ముద్రించిన కరపత్రాలను ఆదివారం స ర్పంచ్‌ లావణ్య, ఉపసర్పంచ్‌ సుదర్శన్‌, వార్డు మెం బర్లు పంపిణీ చేశారు. 

మానిక్‌బండార్‌ వద్ద ఎస్సై వాహనాల తనిఖీ చేపట్టారు. నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌లో రోడ్డుపై తిరుగుతున్న యువకులను పోలీసులు సన్మానించి హెచ్చరించారు. ఏర్గట్ల మండలంలోని గ్రామాల్లో ఇటీవల విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి హోం క్వా రంటైన్‌లో ఉంటున్న వారికి అధికారులు, వైద్యులు కరో నా వైరస్‌పై అవగాహన కల్పించారు. కమ్మర్‌పల్లి మండ లం బషీరాబాద్‌ సర్పంచ్‌ తమ గ్రామంలో కరోనా వ్యాప్తి నివారణ సేవలకు తన రెండు నెలల వేతనాన్ని ఎంపీడీ వో సంతోష్‌రెడ్డికి అందజేశారు. ముప్కాల్‌ మండల కేం ద్రంలోని రిటైర్డ్‌ టీచర్‌ నునుగొండ అంజయ్య రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని ఎంపీపీ పద్మకు అందజేశారు. ముప్కాల్‌ మండలంలోని నల్లూర్‌లో గ్రామ పంచాయ తీ, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు మా స్కులు, రసాయన పదార్థాలను పంపిణీ చేశారు. బోధన్‌ పట్టణంలో ఎమ్మెల్యే షకీల్‌ వంటలు చేయించిన ఆహార పొట్లాలను తన అనుచరులు, నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారుల కు, సిబ్బందికి అందిస్తున్నారు. 

బోధన్‌ మండలంలోని సంగం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ నరేశ్‌రెడ్డి గ్రామ ప్రజలకు కూరగాయలను పంపిణీ చేశారు. కోటగిరి మండలం జల్లాపల్లిఫారం, మండల కేంద్రంలోని పలు వార్డుల్లో కరోనా వైరస్‌పై ప్రజలకు డాక్టర్‌ సమత అవగాహన కల్పించారు.  జిల్లా కేంద్రంలోని ద్వారకామయి పిల్లల దవాఖాన ఆధ్వర్యంలో పని దొరకని వ్యక్తులకు ఉచితంగా నిత్యావసర సరుకులు, పండ్లను డాక్టర్‌ అవినాశ్‌ పంపిణీ చేశారు. విదేశాల నుంచి నవీపేట మండలానికి వచ్చిన వారి వివరాలను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. 


logo