బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Mar 30, 2020 , 01:41:24

ఢిల్లీ వెళ్లొచ్చిన 27 మంది హోం క్వారంటైన్‌

ఢిల్లీ వెళ్లొచ్చిన 27 మంది హోం క్వారంటైన్‌

నమస్తే తెలంగాణ యంత్రాంగం: ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ దర్గా ప్రాంతంలోని జామా మసీద్‌లో నిర్వహించిన ఇస్తేమాకు వెళ్లివచ్చిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలువురికి కరోనా లక్షణాలు కనిపించాయి. వారితో స న్నిహితంగా మెలిగిన వారికీ కరో నా లక్షణాలున్నట్లు అనుమానం రావడంతో అప్రమత్తమైన అధికారులు వారిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నిజామాబాద్‌కు చెంది న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో సదరు వ్యక్తితో కలిసి వెళ్లిన వారిపై వైద్యశాఖ, రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. 

ఇందులో భాగంగానే బోధన్‌కు చెందిన ఐదుగురు, రెంజల్‌ మం డలానికి చెందిన ఒకరు, ఎడపల్లి మండలానికి చెందిన ఇద్దరు, మోస్రా మండలానికి చెందిన తొమ్మిది మంది, మాక్లూర్‌ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు, సిరికొండ మండలానికి చెందిన ఒకరు, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు, భీమ్‌గల్‌కు చెందిన ఒక్కరిని అ ధికారులు గుర్తించారు. వీరందరినీ అధికారులు గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఇద్దరిని, కామారెడ్డి మండలానికి చెందిన ఇద్దరి ని హైదరాబాద్‌ తరలించారు. ఆదివారం ఐదు అనుమానిత కేసులు జిల్లా ఏరియా దవాఖానకు వచ్చాయి. వారిలో ఇద్దరిని హైదరాబాద్‌కు, ముగ్గురిని ఇంటికి పంపించారు. 

27 మంది ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లా వాసులు..

ఇదిలా ఉండగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తితో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాకు చెందిన వారు సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో పాటు వారితో సన్నిహితుంగా ఉన్న వారిని అధికారులు  గుర్తించారు. కొందరిని క్వారంటైన్‌కు, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ నుంచి ఆరుగురు, భైంసా నుం చి 12 మంది, దిలావర్‌పూర్‌ నుంచి 9 మంది వెళ్లినట్లు గుర్తించారు. వారందరికీ స్థానిక అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిర్మల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. 

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన ఒకరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. logo