బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Mar 28, 2020 , 02:30:37

సీఎం నిర్ణయంతో ఎస్సారెస్పీ రైతులకు మేలు

సీఎం నిర్ణయంతో ఎస్సారెస్పీ రైతులకు మేలు

  • రైతుల పక్షాన కేసీఆర్‌కు ధన్యవాదాలు
  • రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఏప్రిల్‌ 10 వరకు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగు నీటిని అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో కాళేశ్వరం జలాల వినియోగం తో ఇవాళ తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉందన్నారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సారెస్పీ ఆయకట్టు పరిదిలో పంటల దిగుబడి పెరిగిందన్నారు.ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోందన్నారు.ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు.లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందన్నారు. రైతులు మార్కెట్‌ కేంద్రాలకు రావద్దని కోరారు.వ్యవసాయ మార్కెట్లన్ని లాక్‌ డౌన్‌ తో మూసివేయబడతాయని తెలిపారు. కేసీఆర్‌ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. స్వయంగా ఆయ న రైతు కనుకనే రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకూ క్షేత్రస్థాయిలో కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చారన్నారు. బోరు బావుల పై ఆధారపడ్డ రైతాంగానికి పంట చేతికి వచ్చే వరకు నిరంతర 24 గంటల నా ణ్యమైన విద్యుత్‌ను అందివ్వాలని విద్యుత్‌ శాఖకు స్పష్ట్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ రైతు బాగు కోసం కేసీఆర్‌ తాపత్రాయపడుతున్నారన్నారు. రైతులు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి తమ పంటలను తమ గ్రామాల్లోనే అమ్ముకోవాలని కోరారు.ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.రైతుల, గ్రామాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతుల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపుతున్నానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.logo