బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 16, 2020 , 01:57:05

అభివృద్ధి పరుగులు

అభివృద్ధి పరుగులు
  • జిల్లా కేంద్రంలో చురుగ్గా ఆరులైన్ల రోడ్డు నిర్మాణ పనులు
  • ట్రాఫిక్‌ ఇబ్బందులకు ఇక చెక్‌
  • పూర్తయిన డివైడర్‌, సీసీ రోడ్ల నిర్మాణాలు
  • రాజధానిని తలపించేలా సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు
  • కామారెడ్డి పట్టణానికి కొత్తఅందాలు..

కామారెడ్డి పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి కావడంతో కొత్త అందాలను సంతరించుకుంది. వార్డుల పునర్విభజనతో 33 వార్డులుగా ఉన్న పట్టణం ఏకంగా 49 వార్డులుగా అవతరించింది. 14 చదరపు కిలో మీటర్లుగా ఉన్న పట్టణం ఇప్పుడేకంగా 61.50 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ ఎక్స్‌ రోడ్డు, కొత్త బస్టాండ్‌, నిజాంసాగర్‌ చౌరస్తా, హైదరాబాద్‌ రోడ్డు మార్గం నాలుగు లైన్లకు విస్తరించినప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి ఈ ప్రధాన రహదారి సరిపోవడం లేదు. దీంతో పట్టణ వాసుల కోరిక మేరకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా  రూ.11 కోట్ల నిధులు విడుదలయ్యాయి.  ప్రస్తుతం ఈ రోడ్డు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే ఇక ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పడినట్లే..

కామారెడ్డి, నమస్తే తెలంగాణ/ విద్యానగర్‌ : పట్టణ సుందరీకరణలో భాగంగా కామారెడ్డి ము న్సిపాలిటీలో కోట్లాది రూపాయల అభివృద్ధి పను లు ముమ్మరంగా కొనసాగాయి. అధునాతన సెం ట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, కాలనీల మధ్య సీసీ రోడ్ల అనుసంధానం, పార్కుల అభివృద్ధి, పట్టణవాసుల కోసం ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో పట్టణం కొత్త అందాలను సంతరించుకుంది. మరోవైపు నర్సన్నపల్లి బైపాస్‌ నుంచి టేక్రియాల్‌ బైపాస్‌ వరకు గల పాత ఎన్‌హెచ్‌ 7 రహదారిని 6 లైన్లకు విస్తరిస్తున్నారు. రూ.11 కోట్లతో చేపట్టిన ఈ పనులు చురు గ్గా సాగుతున్నాయి. దీంతో జిల్లా కేం ద్రంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇప్పటికే నాలుగు లైన్లు  రోడ్డు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంగా మారడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల తాకిడి పెరిగింది.  దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ చొరవతో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించారు. తాజాగా రూ. 11 కోట్లతో 6 లైన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని విద్యానగర్‌, ఆర్యనగర్‌, విద్యుత్‌ కాలనీ, స్నేహపురి కాలనీ, అశోకనగర్‌ కాలనీల్లో  సీసీ రోడ్లు వేశారు. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు సెంట్రల్‌ లైటింగ్‌, పూల మొక్కలతో ఆధునీకరించారు. సమైక్యాంధ్ర సర్కారు హయాంలో చిన్నచూపునకు గురైన కామారెడ్డి పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది.  

విస్తరించిన పట్టణం..

కామారెడ్డి మున్సిపాలిటీ 33 వార్డులతో ఉండగా  పునర్విభజనతో 49వార్డులుగా అవతరించింది. పట్టణ శివారు గ్రామాలైనా టేక్రియాల్‌, సరంపల్లి, అడ్లూర్‌, రామేశ్వరంపల్లి, పాతరాజంపేట, దేవునిపల్లి, లింగాపూర్‌ గ్రామాల విలీనంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. కొత్త పురపాలక చట్టంతో ఈ గ్రామాలు ఇప్పుడేకంగా పట్టణంలో భాగమయ్యా యి.  14 చదరపు కిలో మీటర్లుగా ఉన్న పట్టణం ఇప్పుడేకంగా 61.50 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అదే స్థాయిలో అభివృద్ధి పనులు సైతం పూర్తి చేసుకుంది. రూ.6 కోట్లతో ఆడిటోరియం, రూ.2.60కోట్లతో మోడల్‌ మార్కె ట్‌, రూ.2కోట్లతో జంక్షన్ల అభివృద్ధి, రూ.1.22 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, రూ.1.80 కోట్లతో 4పార్కుల అభివృద్ధి, రూ.2 కోట్లతో రెండు వైకుంఠధామాల అభివృద్ధి, రూ.4కోట్లతో పట్టణంలోని ప్రధా న రహదారుల వెంట డ్రైనేజీల నిర్మాణం, రూ.18.18 కోట్లతో పలు కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. కామారెడ్డి పట్టణం జిల్లా  కేంద్రంగా ఏర్పాటు కావడంతో జన సంచారం, వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఇందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. logo
>>>>>>