గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 08, 2020 , 02:19:07

టెలికం సేవల్లో అంతరాయం

టెలికం సేవల్లో అంతరాయం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంతోపాటు పట్టణ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఐడియా, ఎయిర్‌టెల్‌ సేవల్లో అంతరాయం ఎర్పడడంతో వినియోదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెల్‌ఫోన్‌ పనిచేయకపోవడంతోపాటు నెట్‌వర్క్‌ లేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయాయి. మధ్యాహ్నం వరకు టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడడంతో వాణిజ్య, వ్యాపారవర్గాలతోపాటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేవలం జియో టెలికం సేవలు మాత్రమే పనిచేశాయి. మిగతా టెలికాం సేవలు పని చేయకపోవడంతో ఉన్నతాధికారులకు, టెలికం సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నా సెల్‌ఫోన్లో నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో చేసేది లేక వినియోగదారులు మౌనంగానే ఉండాల్సి వచ్చింది. గతంలో అప్పుడప్పుడు టెలికం సేవలు అంతరాయం ఏర్పడేది. కానీ గంటల తరబడి సేవలు నిలిచిపోవడం ఎప్పుడూ జరగలేదని వినయోగదారులు అంటున్నారు. టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. 


logo
>>>>>>