న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తాజాగా అంబులెన్సుల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. రోగుల రవాణా కోసం ‘మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో రూపొందించిన కాంపాక్ట్ అంబులెన్స్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. వైద్యారోగ్య సేవలకు ఊతమిచ్చేందుకు ప్రత్యేకంగా ఈ అంబులెన్స్‌ను డిజైన్ చేసినట్లు టాటా మోటర్స్ తెలిపింది.