గురువారం 09 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 04, 2020 , 23:42:03

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌  పరీక్షలు షురూ..

విద్యానగర్‌ : జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ -1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్లలో పరీక్షలు కొనసాగగా.. జనరల్‌ 9223 మందికి గాను 8894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు. 1005 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 940 మంది హాజరయ్యారు. 65 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియేట్‌ బోర్డు అధికారులు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో హెల్ప్‌ డెస్క్‌, పరీక్షా కేంద్రాల రూట్‌ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. మాస్‌కాపీయింగ్‌ జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు పరీక్షా సమయం కన్నా పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదని నోడల్‌ అధికారి నాగరాజు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.


logo