ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Mar 03, 2020 , 23:53:47

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..
  • నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • హాజరుకానున్న 19,475మంది విద్యార్థులు
  • జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • నిమిషం ఆలస్యమైనా... నో ఎంట్రీ

విద్యానగర్‌ : ఇంటర్‌ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి(బుధవారం) నుంచి మార్చి 18 వరకు ప రీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 19, 475 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాను న్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు  9,882 మంది, ద్వితీయ సంవత్సరానికి 9,593 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.  పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 30 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, నలుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లు, నలుగురు కస్టోడియన్లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పైగా ఇ న్విజిలేటర్లను నియమించారు. ప్రతి సెంటర్‌లో కౌ న్సెలర్లను నియమించారు. విద్యార్థులకు తాగు నీరు, వైద్య సిబ్బంది, పార్కింగ్‌ వసతి, వాష్‌ రూమ్స్‌, ఫ్యాన్‌, రాత బల్లలు, విద్యుత్‌, ఇంటర్నెట్‌ వసతి కల్పించారు. కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్ల మూసివేత, 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.  పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి.అరగంట ముందు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఉదయం 8.15 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.ప్రతి రోజు ఉదయం 8.30 గంటలలోపు పరీక్షా కేంద్రంలో ఉండాలి.  ఒక నిమిషం ఆలస్యమైన  పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా  కేంద్రాలను గుర్తించేందుకు సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ రూపొందించారు. హాల్‌టికెట్‌ నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది, అక్కడకు ఎలా చేరుకోవాలనేది ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి నాగరాజు తెలిపారు.


logo