బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 01, 2020 , 01:15:11

ఆరో రోజూ.. అదే జోరు..

ఆరో రోజూ.. అదే జోరు..

విద్యానగర్‌ : పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరో రోజు కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ 6, 7, 8వ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలని సూచించారు. కాలనీల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. 7వ వార్డులోని ఆర్‌బీనగర్‌లో ప్రభుత్వ పాఠశాల పక్కన కల్లు దుకాణం ఉండడంతో నిత్యం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వార్డు సభ్యలు తెలుపగా తక్షణమే కల్లు దుకాణాన్ని తొలగించాలని ఎక్సైజ్‌ అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశించారు. పాఠశాల సమీపంలో మురుగు గుంత ఉండడంతో దర్వాసన వస్తున్నదని తెలుపగా వెంటనే శుభ్రం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో పరిసరాలు శుభ్రంగా మార్చాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు, పచ్చదనం పెంపు, ఇంకుడు గుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ స్తంభాల మరమ్మతు, ఇండ్లపై ఉన్న విద్యుత్‌ తీగలను తొలగించడం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 44వ వార్డులో పదిహేను సంవత్సరాల నుంచి అత్యంత అపాయకరమైన కరెంట్‌ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను బిగించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, సీపీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ అమీన్‌సింగ్‌, కౌన్సిలర్లు రాజునాయక్‌, రూప, కృష్ణమోహన్‌, ట్రాన్స్‌కో ఏడీఏ సతీశ్‌ పాల్గొన్నారు.logo
>>>>>>