మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 01, 2020 , 01:08:29

కన్‌కల్‌లో విషాదం

కన్‌కల్‌లో విషాదం

లింగంపేట(తాడ్వాయి) : తాడ్వాయి మండలంలోని కన్‌కల్‌ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్‌కల్‌ గ్రామానికి చెందిన కౌడి పోశయ్య(65) వ్యవసాయ బావిలో బోరు మోటారు బిగించడానికి శుక్రవారం ఉదయం ఆదే గ్రామానికి చెందిన చాకలి అశోక్‌(25)తో కలిసి వెళ్లినట్లు తెలిపారు. వారిద్దరూ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదన్నారు. అశోక్‌ సోదరుడు సంజీవ్‌  ఫోన్‌ చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కౌడి పోశయ్య, చాకలి అశోక్‌ కుటుంబ సభ్యులు గాలిస్తుండగా కౌడి పోశయ్య వ్యవసాయ బోరుబావి వద్ద అశోక్‌, పోశయ్య బట్టలు, సెల్‌ఫోన్‌, చెప్పులను గుర్తించినట్లు తెలిపారు. శనివారం ఉదయం బావిలోని నీటిని మరో మోటారు సాయంతో తొలగించి ఇద్దరి మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. బోరు మోటారు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. సదాశివనగర్‌ సీఐ వెంకట్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారన్నారు. పంచనామా చేసి శవాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి సర్కారు దవఖానకు తరలించినట్లు తెలిపారు. అశోక్‌ సోదరుడు సంజీవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. అశోక్‌కు తల్లి సత్తెవ్వ ఉన్నట్లు పేర్కొన్నారు.logo