మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 29, 2020 , 00:10:00

కంది రైతుకు భరోసా

 కంది రైతుకు భరోసా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కంది పంట ఇంటికి వస్తున్న సమయంలో ప్రైవేటు వ్యాపారుల గిమ్మిక్కులతో రైతులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పంటను కొనుగోలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఊరటను ఇచ్చింది. మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువ ధర ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరతో కంది పంటను కొనుగోలు చే సేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర సర్కారు జిల్లాకు నిర్దిష్ట పరిమితిలోనే కందులు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల మేరకు రైతుల నుంచి పూర్తి మొత్తంలో కొనుగోలు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలో 6 కేంద్రాలు ఏర్పాటు చేయగా... మొన్నటి వరకు నిలిచిపోయిన కొనుగోళ్ల ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం  షురూ అయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో కామారెడ్డి జిల్లాలో మద్నూర్‌, బి చ్కుంద, జుక్కల్‌, కామారెడ్డి, గాంధారి, పిట్లం కొనుగోలు కేంద్రాల్లో 13,170 క్వింటాళ్ల కందులు 1098 మంది రైతుల నుంచి సేకరించారు. వీరికి కనీస మద్దతు ధరను రూ.5,800 కల్పించారు.

మార్క్‌ఫెడ్‌ పటిష్ట చర్యలు...

జిల్లాలో 17వేల 982 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. లక్షా 60వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది వాతావరణం పత్తి, సోయా ఇతర పంటలపై ప్రభావం చూపినప్పటికీ కంది పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. అయితే పంట ఉత్పత్తులు ఇండ్లకు చేరుకునే సమయానికి బహిరంగ మార్కెట్లో ధర తగ్గడం మాత్రం ఆందోళనకు గురి చేసింది. మార్కెట్లో  కందుల ధర పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఏర్పా టు చేసే కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. కనీస మ ద్దతు ధర కోసం ప్రైవేటు వ్యాపారులు సైతం రైతుల ము సుగులో ప్రభుత్వ కేంద్రాల్లో సేకరించిన పంటను అమ్ముకునే అవకాశం ఉంది. మద్దతు ధర రైతులకు అందాలంటే వ్యాపారుల నుంచి వచ్చే కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయాల్సి ఉం ది. రైతుల పేరిట వ్యాపారులు తమ నిల్వలను ప్రభుత్వం రంగ సంస్థలకు అమ్మేస్తే అన్నదాతలు నష్టపోయే అవకాశాలున్నా యి. పైగా లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయని కేం ద్రాలు ఎత్తివేసే వీలుంది. ఈ నేపథ్యంలో రైతులు మాత్ర మే అమ్ముకునేలా అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు.


రూ.5,800 మద్దతు ధరతో భారీ ఊరట...

జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో కంది సాగు ఎక్కువగా ఉన్న పిట్లం, బిచ్కుంద, మద్నూర్‌, జుక్కల్‌, కామారెడ్డి, గాంధారి మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌) ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో కంది పంట సాధారణ విస్తీర్ణానికి ఎక్కువే సాగైంది. పప్పుల ధరలు పెరిగిన నేపథ్యంలో మా ర్కెట్‌లో ధర ఉంటుందని భావించారు. కానీ పంట చేతికి వచ్చే సమయానికి ధరలు తగ్గించారు. కంది పంట ఆశాజనకంగా ఉండడం, ధర ఎక్కువగా ఉంటే కొంత మేరకు లబ్ధి పొందవచ్చని భావించిన రైతులకు ఈసారి నిరాశే మిగిలింది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో కనిపించింది. క్వింటాలుకు ప్రైవేటు వ్యాపారులు రూ.4,500 నుంచి రూ.4,900లకే కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధర రూ.5,800లుగా ఉంది. మద్దతు ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేయడం అన్నదాతలకు భారీ ఊరటను కలిగిస్తున్నది.


logo
>>>>>>