బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 29, 2020 , 00:06:49

శుభ్రతతోనేఆరోగ్యం

శుభ్రతతోనేఆరోగ్యం

నాగిరెడ్డిపేట్‌: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రతతోనే  సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్లారెడ్డి అన్నారు. మండలంలోని గోపాల్‌పేట్‌, పోచారం గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను ఆయన శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. రెండు గ్రామాలు పరిశీలించిన అనంతరం మండలంలోని పల్లె ప్రగతి వివరాలు ఎంపీడీవో శ్యామలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా చూడాలని సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచే దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రామాలు పరిశుభ్రతతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించాలని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రారంభించిన డంపింగ్‌యార్డు, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గోపాల్‌పేట్‌ గ్రామపంచాయతీని పరిశీలించి వివరాలను సర్పంచ్‌ వంజరి సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈసీ మధు, తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి, నాగిరెడ్డిపేట్‌ ఎస్సై మోహన్‌, పోచారం గ్రామ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌, కార్యదర్శి శ్యాం, మహేశ్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.  


logo