బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 24, 2020 , 01:21:42

రోడ్డు విస్తరణకు మోక్షం..

రోడ్డు విస్తరణకు మోక్షం..

మాచారెడ్డి : ఎంతో కాలం నుంచి ఎదురు చుస్తున్న రోడ్డు విస్తరణ పనులకు టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం నిధులు మంజూరు చేసింది. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ మర్రి మీదుగా, ఫరీద్‌పేట, అంబారిపేట, జనగామమర్రి, మా ందాపూర్‌, పెద్దమల్లారెడ్డి గ్రామాలను కలుపుతూ సింగిల్‌లైన్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చుతున్నారు. చాలాకాలంగా డబుల్‌ రో డ్డుగా మార్చాలని డిమాండ్‌ ఉంది. ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. కా మారెడ్డి, సిరిసిల్ల నుంచి పాల్వంచమర్రి మీ దుగా జనగామ మర్రి వరకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి పూట లారీ లు, పౌల్ట్రీ ఫారాలకు, రైస్‌మిల్లులకు వాహనాలు ఇతర జిల్లాల నుంచి ఇదే రహదారిపై వస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు డబుల్‌ రోడ్డుగా మారుతుండడం తో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాల్వంచ మర్రి మీదు గా వాడి, ఫరీద్‌పేట, అంబారిపేట మీదుగా జనగామ మర్రి వరకు పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా కంకర వేస్తున్నారు. అక్కడక్కడ ఉన్న కల్వర్టులను తొలగించి మినీ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు.


15 కిలో మీటర్లు రూ. 22 కోట్లు

పాల్వంచమర్రి నుంచి వాడి, ఫరీద్‌పేట, అంబారిపేట, జనగామమర్రి మీదుగా మాం దాపూర్‌, భిక్కనూర్‌ మండలంలోని పెద్దమల్లారెడ్డి మీదుగా జాతీయ రహదారి కామారెడ్డి-హైదరాబాద్‌కు అనుసంధానం కానుంది. ఈ మార్గం గుండా రామాయంపేటకు ప్ర యాణిస్తే దాదాపు 12 కిలోమీటర్ల వరకు దూ రభారం తగ్గుతుంది.


మూడు జిల్లాలకు అనుసంధానం

ఈ రోడ్డు పూర్తయితే మూడు జిల్లాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. రాజన్నసిరిసిల్లా జిల్లాలోని గంభీరావుపేట మండల ప్రజలు హైదరాబాద్‌ వెళ్లాలంటే లింగన్నపేట, శ్రీగాధ కూడవెల్లి వాగుపైన నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జి మీదుగా బీబీపేట నుంచి రామాయంపేట మీ దుగా వెళ్లవచ్చు. జిల్లా ప్రజలు సిద్ధిపేట వెళ్లాలంటే పాల్వంచమర్రి మీదుగా బీబీపేట, దు బ్బాక నుంచి సిద్ధిపేటకు వెళ్లవచ్చు. మూడు జిల్లాల ప్రజలకు ఈ రోడ్డు కీలకంగా మా రింది. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే మూడు జిల్లాల ప్రజలకు ఎంతో మేలు కల్గుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పాల్వంచ మర్రి వద్ద సర్కిల్‌ ఏర్పాటు 

పాల్వంచ మర్రి వద్ద మూడు రహదారుల కూడలిఉంది. ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడ సర్కిల్‌ ఏర్పాటు చేస్తున్నారు. సర్కిల్‌లో బండరామేశ్వరపల్లి గ్రామంలోని ఉన్న శ్రీరాజరాజేశ్వర ఆలయంలోని నందివిగ్రహం మాదిరిగా సర్కిల్‌లో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


logo
>>>>>>