శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 22, 2020 , 01:09:51

నేడే డీసీసీబీ నోటిఫికేషన్‌

నేడే డీసీసీబీ నోటిఫికేషన్‌

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికలకు శనివారం జిల్లా సహకార శాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. గురువారమే ప్రభుత్వం ఈ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నిక కోసం జారీ
  • 25న నామినేషన్లు.. 28నఎన్నికలు.. 29న చైర్మన్‌ ఎన్నిక
  • డీసీసీబీ డైరెక్టర్లు 20 మంది..డీసీఎంఎస్‌ డైరెక్టర్లు 10 మంది..
  • రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికలకు శనివారం జిల్లా సహకార శాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. గురువారమే ప్రభుత్వం ఈ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదే రోజు స్క్రూటినీ, ఉప సంహరణ నిర్వహిస్తారు. ఒకే నామినేషన్‌ వస్తే ఏకగ్రీవంగా డైరెక్టర్‌ స్థానాల ను ప్రకటిస్తారు. డీసీసీబీకి 20 డైరెక్టర్‌ స్థానాలుంటాయి. ఇందులో పీఏసీఎస్‌ చైర్మన్లు 16 మంది ఉంటారు. మరో నలుగురు ఇతర కులవృత్తుల సంఘాల నుంచి పోటీ చేస్తారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలు మొత్తం 10 ఉంటాయి. ఇందులో ఆరుగురు సొ సైటీ చైర్మన్లు డైరెక్టర్‌ స్థానాల కోసం పోటీ చేస్తుండగా.. మరో న లుగురు ఇతర సంఘాల నుంచి బరిలో ఉంటారు. ఉమ్మడి జి ల్లాకు చెందిన ఎన్నికలు కావడంతో 144 సొసైటీ చైర్మన్లు ఈ డై రెక్టర్‌ స్థానాల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీసీబీలోని కొత్త భవనం.. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీఎంఎస్‌ కార్యాలయ భవనంలో ఉం టుంది. ఈనెల 28న ఎన్నికలు రెండింటికీ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఏ క్లాస్‌.. బీ క్లాస్‌..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలను ఏ క్లాస్‌, బీ క్లాస్‌గా విభజించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా పూర్తి చేశారు. ఏ క్లాస్‌లో సొసైటీ చైర్మన్లు మాత్రమే డైరెక్టర్‌గా పోటీ చేసేందుకు అర్హులు. బీ క్లాస్‌లో ఇతర కులవృత్తుల సంఘాలకు చెం దిన నాయకులు పోటీ చేస్తారు. ఇలా రెండు గ్రూపులుగా డైరెక్టర్‌ స్థానాలను విభజించారు. డీసీసీబీలో ఏ క్లాస్‌ నుంచి 16 మంది డైరెక్టర్లుగా పోటీ చేయనుండగా.. బీ క్లాస్‌ నుంచి నలుగురు పోటీ చేస్తారు. వీరికి ఏ క్లాస్‌ డైరెక్టర్ల కోసం ఉమ్మడి జిల్లాలోని 144 మంది సొసైటీ చైర్మన్లు  ఓటేయాల్సి ఉంటుంది. బీ క్లాస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం 111 మంది నలుగురికి ఓటేస్తారు. డీసీఎంఎస్‌లో ఏ క్లాస్‌లో ఆరుగురు, బీ క్లాస్‌లో నలుగురు  ఉన్నారు. ఏ క్లాస్‌ నుంచి డైరెక్టర్‌ స్థానాలకు పోటీలో ఉన్న ఆరుగురికి 144 మంది సొసైటీ చైర్మన్లు ఓటేయాల్సి ఉంటుంది. బీ క్లాస్‌ నుంచి నలుగురి డైరెక్టర్ల కో సం ఓటరు జాబితాలో బీ క్లాస్‌ నుంచి ఉన్న ఏడుగురు ఓటేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా పూర్తి చేశా రు. ఓటింగ్‌ కోసం రిజర్వేషన్ల వారీగా బ్యాలెట్‌ పత్రాలను రూపొందించారు. ఈ మేరకు సర్వంసిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. 


నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ఇలా.. 

ఈ నెల 25న నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు.  మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్ర చురిస్తారు. ఈనెల 28న ఎన్నికలుంటాయి. 

 పోటీలో ఎవరూ లేకుండా ఒకటే నామినేషన్‌ వస్తే  డైరెక్టర్‌ స్థానానికి ఎన్నిక ఉండదు.  డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికకు కూడా ఇదే విధంగా షెడ్యూల్‌ విడుదల చేశారు. 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. 


డీసీసీబీ ఓటరు జాబితా  

ఓటర్లు డైరెక్టర్లు

ఏ క్లాస్‌ బీ క్లాస్‌ ఏ క్లాస్‌ బీ క్లాస్‌

144 111 16 04

డీసీఎంఎస్‌  ఓటరు జాబితా..            

ఓటర్లు డైరెక్టర్లు 

ఏ క్లాస్‌ బీ క్లాస్‌ ఏ క్లాస్‌ బీ క్లాస్‌

144 7 6 04

డీసీసీబీ (రిజర్వేషన్లు)

ఏ క్లాస్‌ బీ క్లాస్‌

ఎస్సీ-3 ఎస్సీ -01

ఎస్టీ-1 ఎస్టీ-01

బీసీ-2 బీసీ-01

ఓసీ(జనరల్‌)-10 ఓసీ-01

డీసీఎంఎస్‌ ( రిజర్వేషన్లు)

ఏ క్లాస్‌ బీ క్లాస్‌

ఎస్సీ -01 ఎస్సీ-01

ఎస్టీ-01 ఎస్టీ-0

బీసీ-01 బీసీ-01

ఓసీ(జనరల్‌)- 03 ఓసీ-01

బ్యాలెట్‌ పత్రాల రంగులు

ఎస్సీ కేటగిరి పింక్‌ కలర్‌

ఎస్టీ కేటగిరి లైట్‌ బ్లూ కలర్‌

బీసీ లైట్‌ గ్రీన్‌

జనరల్‌ తెలుపు


బీ క్లాస్‌లో డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న సంఘాలు

మత్స్య సహకార, గీత వృత్తి  కార్మిక, వెదురుబొంగుల కార్మికుల, ఎంప్లాయీస్‌ సంఘాలు, లేబర్‌ కాంట్రాక్ట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలు తదితరులు.


logo