శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 21, 2020 , 05:06:17

పల్లె మురవాలి ప్టణం మెరవాలి

పల్లె మురవాలి ప్టణం మెరవాలి

రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కార్యక్రమమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

  • పట్టణ ప్రగతి, పంచాయతీ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
  • ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని ప్రజాప్రతినిధులకు పిలుపు
  • ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషారావు తీరుపై అసహనం
  • జనాభా వివరాలు చెప్పలేకపోయిన గాంధారి సర్పంచ్‌, సెక్రటరీలపై అసంతృప్తి
  • ట్రాక్టర్ల కొనుగోళ్లలో కలెక్టర్‌ శరత్‌ చొరవకు ప్రశంస
  • పంచాయతీ రాజ్‌, పురపాలక చట్టాలపై అవగాహన కల్పించిన కలెక్టర్‌

రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కార్యక్రమమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్‌ హాలులో కలెక్టర్‌ ఎ.శరత్‌ అధ్యక్షతన జరిగిన పట్టణ ప్రగతి, పంచాయతీ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనల నుంచి వచ్చిన కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేసే అద్భుతమైన అవకాశాన్ని ప్రజాప్రతినిధులకుకలిగిందని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేసిన పల్లె ప్రగతి రెండు విడతల్లో అద్భుతమైన ఫలితాలే నిదర్శమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రజల మదిలో నిలిచిపోతారన్నారు. జిల్లాకు వచ్చిన పది రోజుల్లోనే ట్రాక్టర్‌ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసిన కలెక్టర్‌ను మంత్రి సభా వేదికపై అభినందించారు.  విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంపై ఎస్‌ఈ శేషారావు తీరుపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలపై కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించారు.

-కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పంచా యతీ రాజ్‌ చట్టాన్ని, పురపాలక చట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో మార్పు రావాలని కోరుతూ సీఎం తలపెట్టిన కార్యక్రమమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని పేర్కొన్నారు. ఇందులో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులంతా అదృష్టవంతులంటూ కితాబునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్‌ హాలులో  కలెక్టర్‌ ఎ.శరత్‌ అధ్యక్షతన జరిగిన పట్టణ ప్రగతి, పంచాయతీ సమ్మేళనానికి రాష్ట్ర మంత్రి వేము ల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, సురేందర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ ధోత్రెలతో పాటుగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. మూడు గంటల పాటు సాగిన పంచాయతీ సమ్మేళనం, పట్టణ ప్రగతి సమావేశంలో పంచాయతీ రాజ్‌ చట్టం - 2018, పురపాలక చట్టం - 2019 లపై కలెక్టర్‌ శరత్‌ క్లుప్తంగా వివరించారు. 

జిల్లాకు వచ్చిన పది రోజుల్లోనే ట్రాక్టర్‌ కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసిన కలెక్టర్‌కు రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సభా వేదికపై అభినందనలు తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ తీరుపై మంత్రి వేముల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనాభా వివరాలు చెప్పలేకపోయిన గాంధారి సర్పంచ్‌, పంచాయతీ సెక్రటరీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


సేవ చేయడం అదృష్టంగా భావించాలి...

గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయని, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో మంది వచ్చి వెళ్లినా గ్రామాల్లో పరిస్థితులు మాత్రం మారలేదని రాష్ట్ర మంత్రి వేము ల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయ నాయకులను చూస్తే ప్రజలంతా ఈసడించుకునే దుస్థితి రోజురోజుకూ పెరుగుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితులను మార్చేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కేసీఆర్‌ తీసుకువచ్చారని చెప్పారు. ముఖ్య మంత్రి మదిలో నుంచి వచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమా లతో ప్రజలకు సేవ చేసే అద్భుతమైన అవకాశాన్ని కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు ఇప్పుడు కలిగిందని చెప్పారు. గతంలో సేవ చేసే అవకాశమే లేకుండా ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులిస్తూ గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారు స్తున్నదని వివరించారు. ప్రస్తుతం సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీ టీసీ, ఎంపీపీ, కౌన్సిలర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో ఉన్న వాళ్లందరూ కలకాలం గుర్తుండిపోతారని మంత్రి చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం చేతులు దులిపేసుకునేది కాదని వివరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా రాజ కీయ నాయకులకు గౌరవం ఏర్పడిందని, రాష్ట్రంలో అమలు చేసిన పల్లె ప్రగతి రెండు విడతల్లో అద్భుతమైన ఫలితాలే నిదర్శమని ఆయన పేర్కొన్నారు. ఐదేండ్ల పాటు ఇదే స్ఫూర్తితో పనులు జరగాలని, సరిపడా నిధులు కూడా వస్తాయని తెలి పారు. పల్లెలకు ప్రతీ వ్యక్తికి రూ.1600 చొప్పున నిధులు మం జూరవుతుండగా, పట్టణంలో ప్రతీ వ్యక్తికి రూ.1200 చొప్పున నిధులు ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల తో సంబంధం లేకుండా సీసీ రోడ్లకు త్వరలోనే నియో జ కవర్గానికి రూ.3కోట్ల నిధులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రాబో తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ట్రాక్టర్‌ కొనుగోళ్ల ప్రక్రియ ను మొత్తం గ్రామ పంచాయతీలకు పూర్తి చేసిన  కలెక్టర్‌కు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్యాం కర్లు సైతం తొందర్లోనే గ్రామాలకు చేరతాయని పేర్కొన్నారు. 


ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ తీరుపై అసహనం...

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమావేశంలో ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) ఎస్‌ఈ శేషారావు తీరుపై మం త్రి అసహనం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేటకు చెందిన ఓ మ హిళా సర్పంచ్‌ తమ గ్రామంలో విద్యుత్‌ సమస్యపై సంబం ధిత సిబ్బంది స్పందించడం లేదంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన మంత్రి  సదరు అధికారిని వేదికపై పిలిపించి వివరాలు అడిగారు. ఎస్‌ఈ శేషారావు సమాధానం ఇవ్వడంలో అత్యుత్సాహం ప్రదర్శించడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరిస్తామంటూ ఎస్‌ఈ చెప్పబోతుండగా ఇన్ని రోజులు ఆల స్యం ఎందుకు చేశారంటూ మంత్రి ఘాటుగా స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్‌గా పరిగణించాలంటూ జిల్లా కలెక్టర్‌ శరత్‌కు మంత్రి వేముల ఆదేశాలు ఇచ్చారు. వరుసగా ఇదీ రెండోసారంటూ ఎస్‌ఈ శేషారావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో గాంధారి సర్పంచ్‌ సంజీవ్‌, సెక్రటరీలను జనాభా వివరాలను మంత్రి అడుగగా ఇరువురూ తడబాటుకు గురవ్వడంపై మంత్రి మండిపడ్డారు. గ్రామ వివరాలు చెప్పలేకపోతే ఎలాగంటూ సెక్రటరీని మందలించారు.


పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట

ప్రతీ గ్రామ పంచాయతీలకు నర్సరీలను ఏర్పా టు చేసి మొక్క లను పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టడం సాధారణ విషయం కాదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చెప్పారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు జనాల్లోకి వచ్చి ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, వానలు కూడా సరిగా పడడం లేదని గుర్తు చేశారు. బాధ్యతగా మొక్కల పెంపకాన్ని చేపట్టి 85శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచులు, కౌన్సిలర్లదేనని ప్రభుత్వ విప్‌ గుర్తు చేశారు. లేదంటే పదవులు ఊడడం ఖాయమని చెప్పారు. కొత్త చట్టాల్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకు వచ్చిన పల్లె ప్రగతితో గ్రామాల్లో మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. రెండు విడతలుగా అమలైన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెల్లో స్పష్టమైన మార్పును చూసినట్లుగా వివరించారు. పట్టుదలతో పని చేయాలని, ఆగమాగమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేయొద్దని సూచనలు చేశారు. 33 జిల్లాల్లో కామారెడ్డి జిల్లాను మేటిగా నిలిపేందుకు ప్రజా ప్రతినిధులంతా ప్రయత్నించాలని ప్రభుత్వ విప్‌ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఆశించిన గ్రా మ స్వరాజ్యాన్ని విభిన్న కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.339 కోట్లు పంచాయతీలకే విడుదల చేస్తున్నదని వివరించారు. ఇంతకు ముందు అనేక ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ గ్రామాల్లో మార్పు రాలేద ని ఇప్పుడు పల్లె ప్రగతితో మార్పు కనిపిస్తున్న  వివరించారు. మంచి పనులు చేస్తే ప్రజ లెప్పుడూ ఆశీర్వదిస్తారని, వరుస ఎన్నికల్లో అదే చూశామని చెప్పారు.


తస్మాత్‌ జాగ్రత్త... చట్టాలు కఠినతరం...

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు, అధికారులపై వేటు పడడం ఖాయమని  కలెక్టర్‌ డా.ఎ.శరత్‌ వివరించారు. పంచాయతీ సమ్మేళనం, పట్టణ ప్రగతి ఉమ్మడి సమావేశంలో ఆయన సుధీర్ఘంగా మా ట్లాడారు. కొత్త చట్టాలపై సంపూర్ణంగా అవగాహన కల్పించా రు. కలెక్టర్ల సమావేశంలో సీఎం వెలిబుచ్చిన ఆలోచనా విధానాలు పంచుకున్నారు. కేసీఆర్‌ తరచూ చెప్పే ఆరంభింపరు నీచ మానవులు అనే పద్యాన్ని చదివి కలెక్టర్‌ శరత్‌ సభికులకు వివ రించారు. పారిశుద్ధ్యం, కరెంట్‌ సమస్యలు, చెత్త సేకరణ, మురికి ప్రక్షాళన ప్రధాన ధ్యేయంగా 24వ తేదీ నుంచి పది రో జుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్‌ చట్టం - 2018, పురపాలక చట్టం -2019 ద్వారా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ప్రజా ప్రతినిధులకు మంచి అవకాశం దొరి కిందని అన్నారు. విధులు, అధికారాలు, బాధ్యతలు చట్టాల్లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త సేకరణ, నర్సరీల నిర్వహణ, వీధి దీపాలు, పన్నుల వసూళ్ల లో విఫలమైతే గ్రామ స్థాయిలో సర్పంచుల పదవులు ఊడతా యని కలెక్టర్‌ హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యం చేసినా వా రిపై వేటు తప్పదని గుర్తు చేశారు. పట్టణ ప్రగతిలో వార్డుల వా రీగా ప్రణాళికలు రూపొందుతాయని చెప్పారు. శాస్వత ప్రా తిపదికన స్పెషల్‌ ఆఫీసర్‌ నియామకం ఉంటుందని తెలిపారు. ప్రతి రోజు చెత్త సేకరణ, మురికి నిర్మూళన, రోడ్లపై గుంతలు, గోతులు లేకుండా చూడ టం, విద్యుత్‌ సంబంధిత సమస్యలకు పట్టణ ప్రగతిలో పరిష్కరించబడుతుందని చెప్పారు.


ప్రజలకు సేవ చేయాలి

ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు సేవ చే యాలి.  సీఎం కేసీఆర్‌ ఆశయాలను భావితరాలకు అందించాలి. అధికారులు ప్రజా ప్రతినిదులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గ్రామాన్ని ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలి.  

-జాజాల సురేందర్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

 

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రతి గ్రామంలో నర్సరీలు, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల పనులను వెంటనే పూర్తి చేయాలి. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, వార్డు సభ్యులు కృషి చేసి  బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దేశంలోని తెలంగాణ రాష్ట్రం సంక్షేమ, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. 

-దఫేదార్‌ శోభ, జడ్పీ చైర్‌పర్సన్‌ 


  కలసికట్టుగా పని చేయాలి

సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో పల్లె, పట్టణ ప్రగ తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముం దు వరుసలో ఉంది. ప్రభుత్వం అమలు చే స్తు న్న సంక్షేమ పథకాలు  అన్ని వర్గాల ప్రజలకు చేరేలా కృషి చేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కాలువల నిర్మాణం, శుభ్రం చేయ డం, రోడ్లను నిర్మించుకోవడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి సర్పంచులు, కౌన్సిలర్లు  ప్రజలకు మెరుగైన పాలన అందించాలి.  

-బీబీ పాటిల్‌, ఎంపీ


దేశంలోనే  రాష్ట్రం ఆదర్శం

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే  ఆదర్శంగా నిలిచాయి. నిర్ధిష్టమైన ప్రణాళికతో పల్లె ప్రగతి సక్సెస్‌ అయ్యింది. ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమంతో కామారెడ్డి మున్సిపాలిటీని అందరి సహకారంతో ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తాం. పట్టణ ప్రగతిని వందశాతం సక్సెస్‌ చేస్తాం.  

-కామారెడ్డి మున్సిపల్‌ చైరపర్సన్‌ నిట్టు జాహ్నవి


 ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

బాన్సువాడ నూతన మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.  పట్టణంలోని మురికి కాలువల నిర్మాణం, డ్రైనేజీల శుభ్రం, పాత బోరుబావులు, పాత ఇండ్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపడతాం. ప్రతి వార్డును పరిశుభ్ర వార్డుగా తయారు చేస్తాం.   

-జంగం గంగాధర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, బాన్సువాడ 


సమష్టి కృషితో అభివృద్ధి

ఎల్లారెడ్డి మున్సిపాలిటీని సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైనా సౌకర్యాలను కల్పిస్తాం. పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు  చేస్తాం. చేస్తామన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిదులు, అధికారులు అందరి భాగస్వామ్యంతో పట్టణ ప్రగతికి సిద్దంగా ఉన్నామన్నారు. 

- కుడుమల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌


చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి అభివృద్ధి పనులు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టంపై సమగ్రంగా వివరించారు. నూతన చట్టాల ప్రకారం ప్రగతి పనులు చేపట్టాలి. నిర్లక్ష్యం వహిస్తే  సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవు.  

- వెంకటేశ్‌ దోత్రే, స్థానిక సంస్థల ప్రత్యేక అధికారి 


logo