శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 21, 2020 , 04:35:29

సేవాలాల్‌ మహనీయుడు

సేవాలాల్‌ మహనీయుడు

జిల్లా కేంద్రంలోని కిరాణ వర్తక సంఘం ఫంక్షన్‌ హాల్‌లో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 281 జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.

  • ఆయన అడుగుజాడల్లో నడవాలి..
  • ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
  • అధికారికంగా జయంతి వేడుకలు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కిరాణ వర్తక సంఘం ఫంక్షన్‌ హాల్‌లో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 281 జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. సేవాలాల్‌ మహరాజ్‌ గిరిజనుల జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గిరిజనులు ఆయన చూపిన బాటలో నడిచి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. అంతకుముందు గంప గోవర్ధన్‌ సేవాలాల్‌ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేంకుమార్‌, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, కామారెడ్డి జడ్పీటీసీ రమాదేవి, మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డి, కౌన్సిలర్‌ భుక్యా రాజు, కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ తదితరులు                         పాల్గొన్నారు.


logo