మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 20, 2020 , 02:52:54

పనులు పూర్తి చేయాలి

పనులు పూర్తి చేయాలి


కామారెడ్డి, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులను ప్రాధాన్యత క్రమంగా పూర్తిస్థాయిలో చేపట్టేందుకు గ్రామ, మండల, స్పెషల్‌ ఆఫీసర్లు, సంబంధిత శాఖలు కృషి చేయాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. కలెక్టర్‌ చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ట్రాలీ, ట్రాక్టర్లు, డంపింగ్‌ యార్డ్‌,కంపోస్టు షెడ్‌, నర్సరీ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో రెండు కిలోమీటర్లు వరకు ఎవెన్యూ ప్లాంటేషన్‌, సీడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. వెటర్నరీ శాఖ ద్వారా పశువులకు ఇన్సూరెన్సు మంజూరు చేయాలన్నారు. విద్యాశాఖ ద్వారా పదోతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య శాఖ ద్వారా ప్రతి పీహెచ్‌సీలో ఆరోగ్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని, పండ్ల మొక్కలు పెట్టాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పదోతరగతి స్టడీ మెటీరియల్‌ ఆవిష్కరణ

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ చాంబర్‌లో బుధవారం కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ పదోతరగతి విద్యార్థులకు విజయపథం స్టడీ మెటీరియల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లకు మెటీరియల్‌ను పంపిస్తామన్నారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. దాతల ద్వారా విద్యార్థులకు స్నాక్స్‌ను అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఈవో రాజు, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>