గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 19, 2020 , 02:12:58

భక్తి భావనతో మానసిక ప్రశాంతత

భక్తి భావనతో మానసిక ప్రశాంతత

నందిపేట్‌ : ప్రతి ఒక్కరికీ భక్తి భావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి సూ చించారు. నందిపేట్‌ మండల కేంద్రంలోని పల్లుగుట్టపై మంగళవారం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది మహిళలతో కుం కుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ నిత్యం భక్తి భావన, ఆధ్యాత్మిక చింతనతో ఉండాలన్నారు. దీంతో ఎన్ని కష్టాలైనా దూరమై ప్రశాంతత దొరుకుతుందన్నారు. సన్మార్గం వైపు పయనిస్తే మంచి వైపు వెళ్తా రని ఎప్పటికీ ఆధ్యాత్మిక భావనను మరిచిపోవద్దన్నారు. మహా శివుడు అభిషేక ప్రి యుడని అభిషేకాలు చేస్తూ శివున్ని ప్రార్థించాలన్నారు. 

నందిపేట్‌ ప్రాంతంలో ఆధ్యాత్మిక భావణ ఉందని, కేదారేశ్వర ఆశ్రమం ఆధ్యాత్మి భావన కలిగేలా కృషి చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందుముందు మరిన్ని చేయాలని కోరారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్‌ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అనంతరం ఉమా మహేశ్వర హాలులో హంపీ పీఠాధిపతితో కలిసి ప్రత్యేక పూజలు చేసి అర్చనలు, అభిషేకాలు చేశారు. 


logo
>>>>>>