గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 16, 2020 , 03:16:31

గులాబీ జైత్రయాత్ర

గులాబీ జైత్రయాత్ర

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్టీరహిత ఎన్నికలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పోరు ఈసారి హోరాహోరీగా సాగింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్‌ ఎన్నిక ల్లో సీట్లు రాని వారు, ఓటమి పాలైన వారు, రియ ల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపార రంగాల్లో ఉన్న ప్రముఖులంతా సహకార పోరులో కాలు దూసేందుకు బరిలో నిలిచారు. ఇందుకోసం అధికార పార్టీ మద్ధతు కోసం తీవ్రంగా శ్రమించి చివరకు కొంత మంది ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్ర లోభాలకు గురి చేసి, నయానో భయానో వారిని మచ్చిక చేసుకుని గెలుపు కోసం అంతా కృషి చేసి విజేతలుగా బయటపడ్డారు. టీసీలుగా విజయం సాధించిన వారంతా ఇప్పుడేకంగా పీఏసీఎస్‌ చైర్మన్‌ గిరిపై దృష్టి సారించారు. టీసీ ఎన్నికల్లో అ నుసరించిన వ్యూహాన్ని ఇందులోనూ చక్రం తిప్పి సహకార సొసైటీ చైర్మన్‌ స్థానాన్ని పొందాలనే కుతూహలంతో చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఫలితాల వెల్లడితోనే డైరెక్టర్లుగా గెలుపొందిన వారిని శిబిరాలకు తీసుకెళ్లడం విశేషం. చైర్మన్‌ ఎన్నిక చేతులు ఎత్తి ఎన్నుకునే పద్ధతి లేకపోవడంతో పీఏసీఎస్‌ పీఠాలను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నిక ఉండడంతో డైరెక్టర్లుగా ఎన్నికైన వారి తీరు ఎలా ఉంటుందోనంటూ భయాందోళనకు సైతం గురవుతున్నారు.


టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌...

వరుస ఎన్నికల్లో సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మరోమారు అదే ఊపును కొనసాగించింది. ఏడా ది కాలంలో ఎదురైన ఎన్నికల్లో వరుసగా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్న గులాబీ శ్రేణుల్లో తా జాగా సహకార సమరం మరింత జోష్‌ను నిం పింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 సొసైటీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే చైర్మన్‌ పీఠాలను అధిరోహించనున్నారు. నేడు జరిగే ఎన్నికల్లో గులాబీ పార్టీ నేతలే లాంఛనంగా ఎన్నిక కానున్నా రు. కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన మద్దతుదారులు బరిలో నిలిచి మరోమారు అభాసుపాలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న   సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రైతు ప్రయోజనకర పథకాల మూలంగా ప్రజల మన్ననలు పొందుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి సహకార ఎన్నికలు మ రింత శక్తిని అందించినట్లు అయ్యింది. కామారెడ్డి జిల్లాలో 713 ప్రాదేశిక స్థానాలు(టీసీ) ఉండగా ఇందులో 594 టీసీలను గులాబీ పార్టీ మద్ధతుదారులే గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అనునయులు కేవలం 94 టీసీలతోనే సరిపెట్టుకున్నారు. ఇక బీజేపీకి ఈసారి కూడా భంగపాటు తప్పలేదు. కాషాయ పార్టీకి చెందిన నాయకులు కేవలం 11 టీసీల్లోనే గెలుపొందారు. 13 చోట్ల ఇతరులు విజ యం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఆయా సంఘాల్లో పలు టీసీలను కైవసం చేసుకు న్నా... ఎక్కడా మెజార్టీ లేకపోవడంతో జిల్లా వ్యా ప్తంగా ఒక్క పీఏసీఎస్‌నూ దక్కించుకోలేక పోతుండడం విశేషం.


712 ప్రాదేశిక స్థానాల్లో ఎన్నిక...

సహకార ఎన్నికల నిర్వహణలో మొదటి దశ పూర్తయింది. పీఏసీఎస్‌లలోని ప్రాదేశిక స్థానాల(టీసీ)లకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం పీఏసీఎస్‌లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల  ఎన్నికలు నిర్వహించడంతో రెండో దశ పరిసమాప్తం కానుంది.తదనంతరం డీసీసీబీ పాలక మండళ్ల ఎన్నికతో మొత్తం ప్రక్రియ పూర్తి కా నుంది. సహకార పోరులో కీలకమైన ఘట్టం ప్ర శాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పలు చోట్ల చిన్నా చితక ఘర్షణలు తలెత్తినప్పటికీ అంతటా శాంతియుతంగానే ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో 713 టీసీల్లో 712 టీసీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌లోని 2వ నెంబర్‌ టీసీకి ఎన్నిక జరుగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది. సహకార సంఘాల ఎన్నికలకు వచ్చే సరికి నిర్వహణ వ్యయాన్ని సంఘాలకే వదిలేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2018లోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గడువుల పొడిగింపుతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో సంఘం నుంచి రూ.లక్ష చొప్పున ముందస్తుగా నిధులు సేకరించింది. ఆ నిధులతోనే ఇప్పుడు ఎన్నికల నిర్వహణను చేపట్టింది. ఎక్కడా ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేశారు. గతంలో 2012లో నిర్వహించిన ఎన్నికలతో పోలిస్తే నిర్వహణ ఖర్చు భారీగానే పెరిగింది.logo
>>>>>>