మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 13, 2020 , 00:58:56

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి..

ఎన్నికలు పకడ్బందీగా  నిర్వహించాలి..

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల పోలింగ్‌, సాయంత్రం నిర్వహించే కౌంటింగ్‌తో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల జిల్లా సహకార అధికారిణి మమత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో ఎన్నికల అధికారులకు నిర్వ హించిన శిక్షణ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడా రు.  15న నిర్వహించే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అలాగే 16న నిర్వహించే అధ్యక్షుల ఎన్నికల్లో నియమ నిబంధనలను పాటించాలన్నారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ పడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు  స్వీకరించాలన్నారు. 11.30 గంటలకు సరిగ్గా ఉన్న నామినేషన్ల వివరాలు ప్రకటించాలని తెలిపా రు. 12 గంటల నుంచి 2గంటల వరకు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలన్నారు.

 2.30గంటలకు పోటీ లో ఉన్న ఫైనల్‌ లిస్టు ప్రకటించాలని తెలిపారు.   గంటల నుంచి 5గంటల వరకు బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించి 5.30గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి వెంటనే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఫలితాలను వెల్లడించాలన్నారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధ్రువపత్రాలు అందజేయాలని వివరించారు. సమావేశంలో ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>