బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 13, 2020 , 00:57:19

అర్హులైన రైతులందరికీ పంట రుణాలు

అర్హులైన రైతులందరికీ పంట రుణాలు

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణాలు ఇప్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి అన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేంద్రరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, జిల్లా ఉద్యాన అధికారి, పశుసంవర్ధక శాఖ, సహాయ సంచాలకుడు భాస్కర్‌తో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద జిల్లాలో 1,53,344 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, పంట రుణాలు పొందని రైతులకు రుణాలు ఇప్పించాలన్నారు. ఇంతవరకు పంట రుణాలు పొందని రైతులను గుర్తించి, అర్హులైన రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. పంట రుణాలు పొందని రైతులు వ్యవసాయ అధికారులను, సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను కలిసి పంట రుణాలు పొందాలని అన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద లబ్ధి పొంది, పంట రుణాలు పొందని రైతులకు సంబంధిత బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. పంట రుణం లేని రైతుల వివరాలు సేకరించి వ్యవసాయ శాఖకు అందజేస్తామన్నారు. logo