సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 13, 2020 , 00:56:26

పల్లె ప్రగతితో గ్రామాల పరిశుభ్రత

పల్లె ప్రగతితో గ్రామాల పరిశుభ్రత

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద బీబీపేట్‌ మండలంలోని ఏడు గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను జీపీ పాలకవర్గాలకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా పాలకవర్గాలు కృషిచేయాలని సూచించారు. మండలంలోని ఉప్పర్‌పల్లి, కోనాపూర్‌, జనగామ, ఇస్సానగర్‌, యాడారం, మల్కాపూర్‌, తుజాల్‌పూర్‌ గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేంకుమార్‌, బీబీపేట్‌ ఎంపీపీ బాలమణి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.   


logo