శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 13, 2020 , 00:56:26

ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి

ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి

విద్యానగర్‌ : ఇంటి పన్ను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ ఆర్‌ఐ జానయ్య కోరారు. డెయిలీ ప్రాపర్టీ టాక్స్‌ కలెక్షన్స్‌లో భాగంగా కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను నక్షత్ర అసోసియేషన్‌ యాజమాన్యం ఆస్తి పన్ను బకాయిలు రూ.2,16,000 బుధవారం చెల్లించారు. కార్యక్రమంలో బిల్‌ కలెక్టర్లు డేవిడ్‌ రాజు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి పన్నుల వసూలు

బీబీపేట్‌ : మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటా తిరుగుతూ బుధవారం ఇంటి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, నవీన్‌, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. logo