మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 12, 2020 , 00:34:00

పరిపాలనలో తీన్మార్‌

పరిపాలనలో తీన్మార్‌

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చాక కలెక్టర్లతో రెండో సారి నిర్వహించిన సద స్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలతో పాటు కొత్తగా తీసుకు రాబోతున్న రెవె న్యూ చట్టంపైనా సదస్సులో విస్తృతంగా చర్చించడమే ఇందుకు కారణంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతి, పట్ట ణ ప్రగతి, హరితహారం, వచ్చే వానాకాలం కార్యాచరణ, పౌరులకు హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన వంటి కీలకమైన అంశాలపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం లో కీలకమైన ఎన్నికలన్నీ ముగియడంతో కేసీఆర్‌ పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించారు. పలు సంస్కరణలు చేపట్టారు. జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం, జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల స్థానం లో అదనపు కలెక్టర్లను నియమించారు. స్థానిక సం స్థల కోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ నియామ కం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు కొత్త పాల న పంథాను సీఎం సమగ్రంగా వివరించినట్లు స మాచారం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్ర భుత్వ కార్యక్రమాలు ఉండేలా, వాటిని సమర్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉం దని సీఎం స్ప ష్టం చేశారు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత వెల్లివిరిసేలా, కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కలెక్టర్లకు అండగా  అదనపు కలెక్టర్లను నియామకంపై సీఎం వివరించినట్లు సమాచారం.

నిరంతరం పల్లె ప్రగతి...

గతేడాది నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి గ్రామాలను బాగు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్‌ 5వ తారీఖు వరకు నిర్వహించిన 30 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్‌ జ నవరిలో రెండో విడతను అమలు చేశారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. పనులన్నీ గ్రామ పం చాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని చె ప్పారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇత ర ఖర్చులను పక్కన పెట్టి గ్రామాలకు నిధులు మం జూరు చేస్తున్నట్లుగా తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉందని, నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్లకు సహాయకంగా ఉండేందుకే అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించినట్లు గుర్తు చేశారు.

తనిఖీలకు జిల్లాలకు సీఎం...

15 రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్యదర్శులు, జడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పులు రావాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై ఇప్పటికే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే రానున్నట్లుగా కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏ గ్రామమైనా అనుకున్న విధంగా లేకపోతే చర్య లు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన వారికి అవార్డులు, ప్రోత్సహకాలు ప్రభు త్వం అందించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో నాటిన మొక్కల్లో 85శాతం కచ్చితంగా బతికించాలన్నారు. గ్రామంలో శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు.


logo
>>>>>>