శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 12, 2020 , 00:31:09

విద్యార్థి దశ కీలకమైనది

విద్యార్థి దశ కీలకమైనది

పిట్లం : విద్యార్థి దశ చాలా కీలకమైనదని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని, సెల్‌ఫోన్‌ వినియోగం తగ్గించాలని సూచించారు. విద్యార్థుల చదువు సమాజ అభివృద్ధికి కృషి చేసేలా ఉండాలని, కళాశాలకు, కుటుంబీకులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంచి ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కనాటి నీరు పోశారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణారెడ్డి దొర, కుమ్మరి రాములు, విజయ్‌, నాయకులు బాబు మేస్త్రి, రవి, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయేందర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. logo