బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 12, 2020 , 00:28:18

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ / దోమకొండ : రాజంపేట్‌ మండలం తలమడ్ల గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదవరెడ్డి, ఎంపీటీసీ రాజు, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు రంగ నర్సాగౌడ్‌, గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌, నాయకులు జూకంటి మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, వజ్జెపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ విప్‌ను సన్మానించిన టీఆర్‌ఎస్‌ నాయకులు

ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ను టీఆర్‌ఎస్‌ దోమకొండ మండల నాయకులు కామారెడ్డిలోని తన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ దోమకొండ సొసైటీ పరిధిలోని 9 సహకార డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ మరింత బలపడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోటసదానంద, విండో చైర్మన్‌ నర్సారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, మాజీ జడ్పీటీసీ మధుసూదన్‌రావు, ఎంపీటీసీలు రమేశ్‌, కానుగంటి శారద నాగరాజు, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిరెడ్డి, శేఖర్‌, సొసైటీ ఏకగ్రీవమైన డైరెక్టర్లు రాజు, నాగరాజు, శంకర్‌రెడ్డి, క్రిష్టారెడ్డి, నాగరాజు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో..

కామారెడ్డి ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను, కామారెడ్డి మున్సిపల్‌ చైరపర్సన్‌ నిట్టు జాహ్నవిని మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విప్‌ గంప గోవర్ధన్‌ పట్టణ ముదిరాజ్‌ సంఘం నూతన అధ్యక్షుడు గెరిగంటి లక్ష్మీనారాయణతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్‌, సీనియర్‌ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, కామారెడ్డి జిల్లా ముదిరాజ్‌ ఐక్య వేదిక అధ్యక్షుడు పున్న రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>