సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 11, 2020 , 01:35:53

అభిమాని ఇంట్లో స్పీకర్‌ జన్మదిన వేడుకలు

అభిమాని ఇంట్లో స్పీకర్‌ జన్మదిన వేడుకలు

బాన్సువాడ నమస్తే తెలంగాణ / నస్రుల్లాబాద్‌ : మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న స్పీకర్‌కు ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్పీకర్‌ ఆలయంలో పూజలు చేసిన అనంతరం విద్యార్థులు, నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విదార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు టీఆర్‌ఎస్‌ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకుడు, దేశాయిపేట విండో చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మాజిద్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, దుర్కి విండో చైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌, నాచుపల్లి విండో చైర్మన్‌ సాయాగౌడ్‌, నాయకులు ప్రతాప్‌, భూమేశ్‌, నాయిని హన్మాండ్లు, వీరారెడ్డి, బొబ్బిలి గంగారాం, రాము, గోపాల్‌, అంజయ్య, కంది మల్లేశ్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.  

స్పీకర్‌కు శుభాకాంక్షల వెల్లువ..

స్పీకర్‌ పోచారం పుట్టినరోజు సందర్భంగా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని ఆయన స్వగృహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ శరత్‌, జేసీ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ దామోదర్‌ రెడ్డి, సీఐలు మహేశ్‌ గౌడ్‌, టాటాబాబు, ఎస్సై కోనారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేయించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్పీకర్‌ ప్రారంభించారు. శిబిరంలో సుమారు వెయ్యి మంది యువకులు పాల్గొన్నారు. రాజశేఖర్‌ అనే యువకుడు పోచారం ఫొటోతో కూడిన జ్యూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోచారం భాస్కర్‌ రెడ్డి, దొడ్ల వెంకట్రాం రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ అంజిరెడ్డి, గోపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పద్మ, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌, నాయకులు మహ్మద్‌ ఎజాస్‌, కౌన్సిలర్లు లింగమేశ్వర్‌, పాశం రవీందర్‌ రెడ్డి, గైక్వాడ్‌ రుక్మిణి, రమాదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్‌, మహ్మద్‌ ఎజాస్‌, అలీమొద్దీన్‌ బాబా, జ్యోతి, తస్లీమా ఫిరోసీ, వెంకటేశ్‌, కిరణ్‌ కుమార్‌, బాడి శ్రీనివాస్‌, వీరారెడ్డి, హైమద్‌, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, హైమద్‌, హకీం, అర్బాస్‌, నర్సుగొండ తదితరులు పాల్గొన్నారు. 


logo