సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 11, 2020 , 01:34:48

విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు

విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్యారోగ్య శాఖ అల్బెండజోల్‌ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ హాజరై కలెక్టర్‌ శరత్‌ కుమార్‌తో కలిసి విద్యార్థులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ... విద్యార్థులు భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. గోళ్లలో, చేతులకు ఉండే మురికితో సూక్ష్మజీవులు కడుపులోకి వెళ్లి నట్టలుగా తయారవుతాయన్నారు. తద్వారా పిల్లల్లో పోషకాహార లోపం, అకలి లేకపోవడం, కడుపునొప్పి, శక్తిహీనత తదితర సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు. నులిపురుగుల నివారణ కోసం 1-19 ఏండ్ల లోపు విద్యార్థులు తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలన్నారు. కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రంగా ఉండాలని అన్నారు. పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ దామోదర్‌ రెడ్డి, డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.


logo