సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 10, 2020 , 00:48:59

స్పీకర్‌ను కలిసిన దేశాయిపేట్‌ సొసైటీ సభ్యులు

స్పీకర్‌ను కలిసిన దేశాయిపేట్‌ సొసైటీ సభ్యులు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ గ్రామంలోని సొసైటీ ఎన్నికల్లో రెండో సారి ఏకగ్రీవం సాధించిన పాలక వర్గ సభ్యులు ఆదివారం బాన్సువాడలో రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. గత  ఎన్నికలతో పాటు ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంకావడంతో  స్పీకర్‌ పోచారం దేశాయిపేట్‌ గ్రామస్తులను, సర్పంచ్‌ శ్రావణ్‌కుమార్‌ను అభినందించారు. అనంతరం సర్పంచ్‌ శ్రావణ్‌కుమార్‌ స్పీకర్‌ పోచారం, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువనాయకుడు, దేశాయిపేట్‌ సొసైటీ చైర్మన్‌గా రెండోసారి పగ్గాలు చేపట్టనుం డడం తో పోచారం భాస్కర్‌ రెడ్డిని  పూల మాలలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్‌, అంజయ్య, ఇబ్రహీంపేట్‌ సర్పంచ్‌ నారాయణ రెడ్డి, అంబర్‌సింగ్‌, పరిగె సాయిరెడ్డి, మోహన్‌ రెడ్డి, అంజయ్య ఉన్నారు.logo