మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 09, 2020 , 00:13:58

వసతి గృహాల్లో మెనూ ప్రదర్శించాలి

వసతి గృహాల్లో మెనూ ప్రదర్శించాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ :  జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మెనూ తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ సూచించారు. రెసిడెన్షియల్‌, వసతి గృహ విద్యార్థులు ఎస్సెస్సీలో వందశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ట్యూటర్లు సాయంత్రం బోధన చేయాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో పూర్తిస్థాయిలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌, మెనూ ప్రకారం గర్భిణులకు పోషకాహారం అందిచాలన్నారు. వసతిగృహాల్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి కేంద్రంలో ఐదు పండ్ల మొక్కలు నాటాలన్నారు. బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఝాన్సీ రాణి, ఎస్టీ వెల్ఫేర్‌ అధికారిణి అంబాజీ, సీడీపీవోలు పాల్గొన్నారు.  

మత్స్య సంపద అభివృద్ధికి కృషిచేయాలి

మత్స్య కో ఆపరేటివ్‌ సొసైటీలు మత్స్య సంపద అభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు. జనహిత భవన్‌లో మత్స్య శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మత్స్య శాఖ ద్వారా జిల్లాలోని 551 ట్యాంకుల్లో ఇంటిగ్రేటెడ్‌ ఫిష్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (ఐఎఫ్‌డీఎస్‌) ద్వారా విడుదల చేసిన ఫిష్‌ సీడ్‌ ఉత్పాదకతపై ప్రణాళిక చేపట్టి మార్కెటింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. గంగపుత్రులకు కావాల్సిన టూ వీలర్స్‌, నెట్‌లు, పరికరాల పంపిణీ చేయాలన్నారు. ఫిష్‌పాండ్‌ ఏర్పాటుకు అధికారులు కృషిచేయాలని సూచించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలో మార్కెట్‌ కేంద్రాల నిర్మాణానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మత్స్య శాఖ అధికారిణి పూర్ణిమ ఎఫ్‌డీవో డోలీ సింగ్‌,  సిబ్బంది పాల్గొన్నారు. 


logo
>>>>>>