బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 09, 2020 , 00:12:53

చివరిరోజు జోరుగా ‘సహకార’ నామినేషన్లు

చివరిరోజు జోరుగా ‘సహకార’ నామినేషన్లు

దోమకొండ : మండలంలోని ముత్యంపేట సహకార సంఘం పరిధిలోని 3, 9,10,13వ టీసీల్లో ఒక్కొక్క నామినేషన్‌ 4,7,8,11 టీసీల్లో రెండు నామినేషన్లు, 5వ టీసీలో మూడు నామినేషన్లు వేశారు. శనివారం మ్తొతం 17 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారి రవికుమార్‌ తెలిపారు. దోమకొండ సహకార సంఘం సొసైటీ పరిధిలో శనివారం 1వ టీసీకి 2, 2వ టీసీకి 4, 3వ టీసీకి 2, 4వ టీసీకి 2, 5వ టీసీకి 3, 6వ టీసీకి 1, 7వ టీసీకి 1, 8వ టీసీకి 1, 9వ టీసీకి 1, 10వ టీసీకి 2, 11వ టీసీకి 2, 13వ టీసీకి 3 మొత్తం 24 నామినేషన్లు శనివారం దాఖలైనట్లు ఎన్నికల అధికారి మాణిక్‌శర్మ తెలిపారు. దోమకొండ సొసైటీ పరిధిలోని సీతారాంపూర్‌ గ్రామ 12వ టీసీకి నత్తి లక్ష్మి  డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.  

రాజంపేటలో..

రాజంపేట్‌ : రాజంపేట సొసైటీకి శనివారం 16 నామినేషన్లు, ఆర్గొండ సొసైటీకి 5 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ తెలిపారు. మూడు రోజుల పాటు స్వీకరించిన నామినేషన్లు మొత్తం రాజంపేట సొసైటీకి 42, ఆర్గొండ సొసైటీకి 31 దాఖలయ్యాయని వివరించారు.  

బీబీపేటలో..

బీబీపేట్‌: మండలంలోని సొసైటీ పరిధిలో 13 స్థానాలకు శనివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మొదటి రోజు 8 నామినేషన్లు, రెండో రోజు 17, మూడో రోజు 21 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. మొత్తం 46 నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. టీసీ7లో ఎస్సీ (మహిళా) రిజర్వేషన్‌ కావడంతో కావడం, ఒకే నామినేషన్‌ రావడంతో తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బి.సత్తవ్వ సొసైటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు.  

కామారెడ్డి సొసైటీకి 40 నామినేషన్లు..

కామారెడ్డిరూరల్‌ : మండల పరిధిలోని ప్రాథమిక సహకార సంఘంలో 13 డైరెక్టర్‌ స్థానాలకు శనివారం 40 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి దీప్లా, సీఈవో మోహన్‌రావు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి మూడు రోజుల్లో మొత్తం 76 నామినేషన్లు వచ్చాయని తెలిపారు.  

మాచారెడ్డి సొసైటీకి 53.. 

మాచారెడ్డి : మండల కేంద్రంలోని సొసైటీకి శనివారం 23 నామినేషన్లు దాఖలయ్యాని పీఏసీఎస్‌ ఎన్నికల అధికారి జఠాలాల్‌ తెలిపారు. 13 టీసీలకు మొదటి రోజు 11, రెండో రోజు 19, మూడో రోజు 23 మొత్తం 53 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.  

5వ టీసీకి ఏకగీవ్ర ఎన్నిక ...

మాచారెడ్డి సింగిల్‌ విండో 5వ టీసీ డైరెక్టర్‌గా బైండ్ల కళావతి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి జఠాలాల్‌ తెలిపారు. 5వ టీసీకి ఒకే ఒక నామినేషన్‌ రావడంతో బైండ్ల కళావతిని ఏకగ్రీవం చేశామని పేర్కొన్నారు. డైరెక్టర్‌గా ఎన్నికైన కళావతిని టీఆర్‌ఎస్‌ నాయకులు అభినందించారు. 


logo