సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 09, 2020 , 00:12:53

పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలి

పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలి

భిక్కనూరు (కామారెడ్డి) : ఏడాది నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలని ప్రాథదమిక ఆర్యోగ కేంద్రం వైద్యాధికారి రవీందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బందికి నులి పురుగుల నిర్మూలనపై శనివారం అవగాహన కల్పించారు. ఈ నెల 10వ తేదీన పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి ప్రభాకర్‌, పర్యవేక్షకులు షరీఫ్‌, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

నులిపురుగు నివారణ మాత్రలపై అవగాహన.. 

బీబీపేట్‌: పిల్లల్లో నులిపురుగుల నివారణకు పంపిణీ చేసే అల్బెండజోల్‌ మాత్రలపై మండల కేంద్రంలోని పీహెచ్‌సీ వైద్య సిబ్బంది మండలంలోని జనగామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. 1-19 ఏండ్ల లోపు పిల్లలు ఈ నెల 10న అందజేసే మాత్రలను వేసుకోవాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సర్పంచ్‌ రాజు, ఉపసర్పంచ్‌ ఎల్లం, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ సాయికుమార్‌, ప్రధానోపాధ్యాయుడు విశ్వమోహన్‌, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo