బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 23:58:54

అలరించిన సైన్స్‌ ఫేర్‌

అలరించిన సైన్స్‌ ఫేర్‌

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్‌ హైస్కూల్‌లో వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్‌ ఫేం వేణు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ ఇందుప్రియ వేణుతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు సైన్స్‌ సబ్జెక్టుపై దృష్టి సారించి వైజ్ఞానికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ పున్న రాజేశ్వర్‌, కౌన్సిలర్‌ నిట్టు కృష్ణమోహన్‌రావు, యాజమాన్యం పున్న అరుణ, పావని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.   

శ్రీ చైతన్య విద్యానికేతన్‌లో...

భిక్కనూరు (కామారెడ్డి) : మండల కేంద్రంలోని శ్రీచైతన్య విద్యానికేతన్‌ హెస్కుల్‌లో సైన్స్‌ ఫేర్‌ను శనివారం నిర్వహించారు. సర్పంచ్‌ తునికి వేణు, ఎస్సై నవీన్‌కుమార్‌ ముఖ్యఅతిథులుగా హాజరై సర్వసతీ చిత్రపటానికి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 100 మంది విద్యార్థులు పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రయోగాల రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికి తీయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రకాంత్‌రెడ్డి, అడ్వకేట్‌ భిక్షపతి, లయన్స్‌ కబ్ల్‌ ప్రతినిధులు, శ్రీరాం,  వెంకటేశ్‌, సుదర్శన్‌, ఉపాధ్యాయులు రేణుకుమార్‌, అశోక్‌, విద్యార్దులు పాల్గొన్నారు. 


logo