బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 00:22:54

సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి..

సంక్షేమ పథకాలు అర్హులైన  ప్రతి ఒక్కరికీ చేరాలి..

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని  కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు. జనహిత హాలులో వైద్యాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం పేదవారికి కల్పిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశ, మెడికల్‌ ఆఫీసర్స్‌, ప్రోగామింగ్‌ అధికారులు వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యాంటినేటల్‌ చెకప్‌ వందశాతం సాధించి, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. ఇమ్యూనైజేషన్‌ పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవుట్‌ పేషెంట్స్‌ ఎక్కువ లేని చోట హెల్త్‌ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. నాన్‌ కమ్యూనేబుల్‌ డిసీజ్‌ వందశాతం పురోగతి సాధించాలని, ఐయూసీడీ శాతం పెంచాలన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఫండ్‌ ద్వారా దవాఖాలను అభివృద్ధి చేయాలని అన్నారు. కేసీఆర్‌ కిట్‌ పేదలకు చేరడంలో పురోగతి పెంచాలన్నారు. టీబీ వ్యాధి నివారణకు స్కూటమ్‌ పరీక్షలు నిర్వహించేలా ప్రోగ్రామింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ దోత్రె, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, మెడికల్‌ అధికారులు పాల్గొన్నారు.


logo